టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా వరుస సక్సెస్‌లు అందుకుంటూ ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవికి చెందిన ఓ లగ్జరీ షిప్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి. 2023లో రూ.6075 కోట్లు ఖర్చు చేసి మరి చిరు ఈ లగ్జరీ క్రూయిజ్ షిప్ తయారు చేయించాడట. పెద్ద పెద్ద సునామీలు, భూకంపాలను సైతం తట్టుకొని స్ట్రాంగ్‌గా ఉండేలా దీనిని చాలా ప్రత్యేకంగా తయారు చేయించాడట.
అంతేకాదు.. ఈ లగ్జరీ షిప్‌ను బుల్లెట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ గా కూడా నిర్మించినట్టు సమాచారం. అలాగే.. ఇందులో 350 కంటే ఎక్కువ బెడ్ రూమ్లు, 474 కంటే ఎక్కువ బాత్రూంలో, షాపింగ్ మాల్స్, సినిమా ధియేటర్లు, రెస్టారెంట్లు, వాటర్ పార్కులు ఇలా అన్ని లగ్జరీ ఫెసిలిటీలు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ క్రూయిజ్ కేవలం లండన్ ,అమెరికా, ప్యారిస్, అండమాన్ లాంటి విదేశాలకు మాత్రమే ప్రయాణం చేస్తుందట.
ఇక ఈ షిప్ ద్వారా ఇప్పటికే చిరంజీవి ప్రతి ఏట రూ.125 కోట్ల పైచిలుకు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడని తెలుస్తుంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం పూర్తిగా ఎడిట్ చేసినట్లు క్లియర్ గా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డితో పాటు.. చిరు హైదరాబాద్‌లో ఎక్స్పీరియన్స్ ఎక్కో పార్క్ సందర్శించిన సంగతి తెలిసిందే. ఆ టైంలో దిగిన ఫొటోస్ తో.. ఇతర దేశాల్లో ఉన్న లగ్జరీ షిప్లను ఎడిట్ చేసి చిరంజీవిని ఆ క్రూయిజ్ కొన్నట్లుగా ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు.
View this post on Instagram