చరణ్ కెరీర్‌లో మూడుసార్లు ఫిక్స్ అయ్యి.. మూడుసార్లు రిజెక్ట్ చేసిన ఏకైక టాలీవుడ్ డైరెక్టర్.. ఎవరంటే..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎలాంటి క్రెజ్‌ను సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆడియన్స్ అంచనాలను అందుకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా రాణించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇక చరణ్ ఎంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయినా సరే.. కోట్లాది ఆస్తులకు వారసుడైనా కాస్త కూడా గర్వం ఉండదు. డౌన్ టు ఎర్త్ పర్సన్. చరణ్ లో ఉండే ఈ సింప్లిసిటీనే.. చాలామంది ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ఆయన ఎంతోమంది ఫేవరెట్ హీరోగా మారాడు.

Ram Charan, Trivikram Movie Confirmed

అంతేకాదు.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా సక్సెస్ అవ్వాలనుకునే చాలామందికి రోల్డ్ మోడల్ గా నిలిచాడు. ఇలాంటి క్రమంలోనే చరణ్‌కు సంబంధించిన ఏదో ఒక వార్త ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక చరణ్ తన సినీ కెరీర్‌లో ఎంతోమంది స్టార్ట్ డైరెక్టర్‌లతో పని చేశాడు. వాటిలో కొన్ని సినిమాలు సక్సెస్ కాగా.. మరికొన్ని ప్లాపులుగా నిలిచాయి. అయితే ఒక్క డైరెక్టర్ తో మాత్రం చరణ్ తన కెరీర్లో ఒకటి కాదు, రెండు కాదు, మూడుసార్లు కమిటీ అవ్వడం.. ఆ మూడుసార్లు కూడా సినిమాలు రిజెక్ట్ అవ్వడం షాక్ అవ్వాల్సిన విష‌యం.

Pawan Kalyan to revoke Ram Charan's shelved project?

నిజంగానే చరణ్ కెరిర్‌లో ఇప్పటి వరకు మరే డైరెక్టర్ విషయంలోనూ ఇలాంటిది చోటు చేసుకోలేదట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికే చరణ్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తే బాగుండని లక్షలాదిమంది అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే గతంలో మూడుసార్లు వీరిద్దరి కాంబో సెటై.. ఏవో కారణాలతో సెట్స్ పైకి రాకుండానే క్యాన్సిల్ అవుతూ వచ్చింది. ఈ కాంబోలో ఇక‌పైనైనా మంచి సినిమా వస్తుందో.. లేదో.. వీరిద్దరూ ఫ్యాన్స్ కోరిక తీరుస్తారో.. లేదో.. వేచి చూడాలి.