టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 లాంటి సాలిడ్ హీట్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ అట్లీ డైరెక్షన్లో పవర్ఫుల్ సినిమాలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే సినీ వర్గాల నుంచి దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా సినిమాకు సంబంధించిన ఏదో వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఇదో పునర్ జన్మ నేపథ్యంలో సాగే కథ అని.. ఇందులో భాగంగానే బన్నీ కూడా రెండు డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడని సమాచారం. తెలుగులో వచ్చిన మగధీర, మనం లాంటి స్టోరీల తరహాలో ఈ కథ కూడా ఉండనుందట. ఇప్పటికే సినిమా స్టోరీ విన్ని.. బన్నీ ఫైనల్ చేశాడని.. త్వరలోనే సినిమా అఫీషియల్ గా ప్రకటించనున్నారని టాక్. త్రివిక్రమ్ సినిమాను పక్కనపెట్టి మరి బన్నీ సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ.. కచ్చితంగా దీనికి ముందే బన్నీ పగడ్బందీగా ప్లాన్ చేసుకుని ఉంటాడని.. పుష్ప 2 లాంటి పాన్ ఇండియన్ హిట్ తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ఆయన ఎంతో శ్రద్ధ చూపించినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఆడియన్స్‌లోను.. బన్నీ నెక్స్ట్ మూవీపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక డైరెక్టర్ అట్లీ కూడా చివరిగా షారుఖ్ ఖాన్ జవాన్ తో వేయికోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి భారీ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ సెట్స్ పైకి రానేలేదు. ఓ మంచి కథను అల్లు అర్జున్‌తో తీయాలని ఫిక్స్ అయిన అట్లీ ఇన్నాళ్లు వెయిట్ చేశాడట. ఇక పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను కూడా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే అట్లీ బాక్సాఫీస్ దగ్గర వరుస సక్సెస్‌లు అందుకుంటూ తిరుగులేని డైరెక్టర్గా మారాడు. ఇక ఇప్పుడు.. అల్లు అర్జున్‌తో చేసే సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మరిన్ని సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి.