స్పిరిట్: ప్రభాస్ విలన్లుగా ఇద్దరు స్టార్ హీరోస్.. దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. చివరిగా సలార్, కల్కిలతో సాలిడ్ హీట్ అందుకున్న ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటివరకు కనీసం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కానీ స్పిరిట్ సినిమా గురించి ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించడంతో ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది. ఒక ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్న ఈ సినిమా సెట్స్‌పైకి త్వరలోనే రానుంది.

Vijay Sethupathi - Wikipedia

స్పిరిట్ అనేది ఇప్పుడు సింపుల్గా అనిపించినా.. ఒక్కసారి సినిమా ప్రారంభమై దాన్ని డెప్త్ తెలిస్తే సినిమా టైటిల్ పవర్ అర్థమవుతుందంటూ సందీప్ వంగా స్వయంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్లడించాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. హీరోయిన్గా రష్మిక మందన, మృణాల్ టాగూర్ పేర్లు వినిపిస్తుండగా.. ఇతర కాస్టింగ్ కాల్ కూడా తాజాగా మేకర్స్ ప్రకటించారు. నటనపై ఆసక్తి ఉన్నవాళ్లు తమను సంప్రదించవచ్చు అంటూ మెయిల్ ఐడిని షేర్ చేసుకున్నారు. ఎలాంటి క్రమంలో తాజాగా సినిమాకు సంబంధించిన క్రేజి అప్డేట్ వైరల్ గా మారుతుంది.

Sanjay Dutt Launches Production Company to Revive Bollywood Heroism

అదేంటంటే ఈ సినిమాలో ప్రభాస్ విల‌న్‌లుగా ఇద్దరు స్టార్ హీరోలను అనుకుంటున్నారట. వారిలో ఒకరు విజయ్ సేతుప‌తి కాగా.. మరొకరు సంజయ్ దత్. వీరిద్దరిలో ఎవరో ఒకరిని కచ్చితంగా ఫిక్స్ చేస్తారని టాక్ ఇండస్ట్రీలో గట్టిగా సాగుతుంది. ఇక ఓ మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్‌ నుంచి వచ్చి పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ మారతాడని.. అంతేకాదు అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాల తరహాలోనే ప్రియురాలు, తండ్రి పై హీరో కుండే విపరీతమైన ప్రేమ టైప్ లోనే.. స్పిరిట్ లో డ్యూటీ పై హద్దు దాటిన కమిట్మెంట్, ప్రేమ ఉన్న వ్యక్తిగా ప్రభాస్ పాత్రను తీర్చి దిద్ద‌నున్నాడ‌ట‌. ఇదే వాస్తవం అయితే ఫ్యాన్స్ కు ఇంకా పండగే. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటివరకు పోలీస్ క్యారెక్టర్ లో నటించింది లేదు. అందులోనూ ప్రభాస్ మైల్డ్ స్టోన్ 25వ సినిమాల్లో పోలీస్ సబ్జెక్టుతో డ్యూటీపై పిచ్చి ప్రేమ, అభిమానం ఉండే వ్యక్తిగా.. క్యారెక్టర్ డ్రివెన్ సినిమా అంటే డార్లింగ్ ఫ్యాన్స్‌లో ఎక్కడలేని అంచనాలు నెలకొంటాయి.