మంచు ఫ్యామిలీ వివాదంపై పెద్ద కోడలు ఓపెన్ కామెంట్స్.. ఏం చెప్పిందంటే..?

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు భార్య వెరోనికా రెడ్డికి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె బయటపెద్దగా కనిపించకపోయినా.. సినిమా ఫంక్షన్లకు ఎక్కువగా హాజరు కాకపోయినా.. తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితురాలే. ఎక్కువగా ఫ్యామిలీతో టైంలో స్పెండ్‌చేస్తూ.. లైఫ్ లీడ్‌ చేసే వెరోనికా.. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే మీడియాకు కనిపిస్తుంది. ఇక విష్ణువుకి సంబంధించిన సినిమా విషయాలు సహా మరి ఏ సంగతుల్లోను ఇన్వాల్వ్ కాదు. భర్త, పిల్లలు, కుటుంబం తప్ప మరో వ్యాపకం లేకుండా ఉండే వెరోనికా.. ఇటీవల మొదటిసారి ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది.

Did you know Manchu Manoj and Manchu Vishnu aren't real brothers?

తాజాగా వెరోనికా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే లైఫ్ స్టైల్, పిల్లలు, భర్త విష్ణు గురించి మాట్లాడింది. మంచు ఫ్యామిలీలో.. విష్ణు, మనోజ్‌ల మధ్య తలెత్తిన వివాదాల గురించి కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. ప్రతి ఫ్యామిలీలోనూ సమస్యలు ఉంటాయి. దురదృష్టవశాత్తు మా ఫ్యామిలీలో కూడా అలాంటి సమస్యలే వ‌చ్చియి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇది మొత్తం కుటుంబం పై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక్కడ టెన్షన్ పడే విషయం ఏంటంటే పిల్లలు. ఇలాంటి విషయాలు పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి.

Viranica Manchu (@viranica) • Instagram photos and videos

కుటుంబంలోని బ్రదర్స్ మధ్య జరుగుతున్న వివాదాలను చూసి.. పిల్లలు భయపడిపోతున్నారు. ఏం జరుగుతుందోనని ఆలోచనలో పడిపోతున్నారు. ఇది పిల్లల సహజస్వభావం. పిల్లలు తెలివిగా ఉండాలంటే నేను కూడా అంతే తెలివిగా వ్యవహరించాల్సి ఉంది. నాకు నా పిల్లలే ముఖ్యం. ఆ ప్రభావం వారిపై పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందుకే నేను ఎన్నో ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాంటి వివాదాల పట్ల వాళ్ళు ఆకర్షితులు కాకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవాలంటూ వెరోనికా చెప్పుకొచ్చింది. కుటుంబ వ్యవహారాల గురించి ఇంటర్వ్యూవర్ అడగగానే.. ఇంత ఓపెన్ గా వెరోనికా మనసులో ఉన్న విషయాన్ని మాట్లాడేయడం అందరికి షాక్ కలిగిస్తుంది. సాధారణంగా ఇంటర్వ్యూలలో కుటుంబ విషయాల గురించి మాట్లాడడానికి ఎవరు ఒప్పుకోరు. కానీ.. వెరోనికా మాత్రం ఎంతో బ్యాలెన్సింగ్ గా ఈ విషయాన్ని షేర్ చేసుకుంది.