బన్నీ – త్రివిక్రమ్ సినిమా ఎవరికి తెలియని ఆ దేవుడి కథ.. నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఇది..!

తెలుగు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తో సాలిడ్ హీట్ అందుకని ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆడియన్స్‌లో కనీవిని ఎరగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. యావత్ ఇండియా.. బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇక బ‌న్నీ – త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ రానుంద‌ని తెలిసిందే. ఇక మీరిద్దరి కాంబో అంటేనే ఒక క్రేజీ కాంబినేషన్. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం ఇలా బ్లాక్ బస్టర్లు అందుకున్న ఈ కాంబోలో నాలుగవ‌సారి సినిమా వస్తుండడంతో ఆడియన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది.

An exciting update about Trivikram-Allu Arjun's combo - Andhrawatch.com

ఇక ఇప్పటివరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కాంబో.. ఇప్పుడు ఫాంటసీ యాక్షన్ జానర్‌ని కూడా ఎంచుకున్నారు. నిర్మాత నాగ వంశీ స్వయంగా ఇంటర్వ్యూలో దీనిపై హింట్ ఇస్తూ ఆసక్తిని పెంచేసాడు. రామాయణ, మహాభారత గాథల్లో ఎంతోమంది వీరుల కథలు ఉన్నాయి. కానీ.. ఎంతో శక్తివంతమైన ఓ గొప్ప దేవుడి కథ ఇప్పటివరకు లోతుగా ఎవ్వరూ చూపించలేదు. ఈ సినిమాలో అలాంటి అద్భుతమైన వీరుడి కథనే మనం చూపించబోతున్నామంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం నాగ వంశీ చేసిన ఈ కామెంట్స్ తో ఈ సినిమా పురాణ గాథ‌ ఆధారంగా ఎవరికి ఎక్కువ తెలియని దేవుడి కాన్సెప్ట్ తెర‌కెక్కుతుందని క్లారిటీ వచ్చేసింది.

Allu Arjun's Next With Trivikram Srinivas Is Mythological Film, Says  Producer Naga Vamsi: Movie On Unheard

ఇక సన్నిహత‌ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రాచీన వీరుడైన కార్తికేయ స్వామిని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించనున్నాడ‌ట‌. ఇప్పటివరకు కార్తికేయుడు పై భారతీయ సినిమాల్లో పెద్దగా కథలేమి చూపించలేదు. తమిళ్ సినీ ఇండస్ట్రీలో కాస్త ఎక్కువగా పరిచయం ఉన్నా.. తెలుగు సినిమాల్లో ఈ కోణం ఇప్పటివరకు చూపలేదు. ఈ క్రమంలోనే ఇది వాస్తవం అయితే అల్లు అర్జున్ గతంలో ఎప్పుడు చూడని విధంగా సరికొత్త రోల్ లో చూడోచన‌డంలో అతిశయొక్కలేదు. ఇక త్రివిక్రమ్ తన కెరీర్లో మొదటిసారి ఓ పురాణ గాధ టచ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ పై ఇప్పటినుంచి హైప్ నెలకొంది.