మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. సినిమాకు హైలెట్స్ ఇవే.. అదే బిగ్ మైనస్..!

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి కథ అయినా.. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవరు గెస్ చేయలేరు. అది పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా.. బడ్జెట్ తో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు అనడంలో సందేహం లేదు. ఇక కొన్నిసార్లు కేవలం బ్రాండ్ ఇమేజ్ పై ఆధారపడి సినిమాలు బ్లాక్ బస్టర్లు అందుకుంటూ ఉంటాయి. అలా ఇప్పటికే బాహుబలి, పుష్ప, కేజిఎఫ్ సినిమాలు మొదటి పార్ట్ కు వచ్చిన బ్రాండ్ బేస్‌ చేసుకుని.. రెండో పార్ట్‌తో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. అలా.. ఈ సినిమాలన్నీ వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఇదే సీక్వెల్ సెంటిమెంట్‌ను నమ్ముకుంటూ.. మరో క్రేజీ మూవీ మ్యాడ్ స్క్వేర్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది.

Mad Square teaser: Narne Nithin's film lives up to the hype, evokes  non-stop comedy

ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ ను పూర్తిచేసుకుంది. దీనికి యూఎ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. డీజే టిల్లు తర్వాత.. మన దగ్గర యూత్ ఫుల్ సినిమాల డిమాండ్ మరింతగా పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ కావడం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి మ్యాడ్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుంది. ఇక రెండేళ్ళ‌ కిందట అతి తక్కువ బడ్జెట్ తో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన మ్యాడ్ మూవీ.. సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. భారీ బ్లాక్ బస్టర్ కాలేజ్ ఎంటర్టైనర్ గా సంచలన వసూళ్లను కొల్లగొట్టింది. దీంతో సీక్వెల్ ఫై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే.. తాజాగా ఈ సినిమా సెన్సార్ రివ్యూ ప్రకారం.. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్‌కార్డ్‌ పడే వరకు ఆడియన్స్‌కు ఎంటర్టైన్మెంట్ కొద‌వ‌ ఉండదంటూ సెన్సార్ సభ్యులు వివరించినట్లు సమాచారం. ఇక సీక్వెల్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని టాక్‌ నడుస్తుంది. సెకండ్ పార్ట్ అంతా లడ్డు పెళ్లి చుట్టూనే తిరుగుతుందని.. ఆ పెళ్లి కోసం అందరూ కలిసి గోవాకు వెళ్లడం.. అక్కడ జర్నీ.. వెళ్లిన తర్వాత జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ అందరిని కడుపుబ్బా నవ్విస్తాయని టాక్. తాజాగా సెన్సార్ నుంచి కూడా ఇదే రివ్యూ వచ్చింది.

MAD Square teaser update increases hype | cinejosh.com

సినిమాకు ఉన్న ఒకే ఒక్క మైనస్ 2 గంట‌ల 10 నిమిషాలతో సినిమాలను ముగించడం. ఫ్యాన్స్‌ కు కాస్త నిరాశగా అనిపిస్తుందని.. మరో 20 నిమిషాల కంటెంట్ ఉన్న కూడా ఆడియన్స్ కచ్చితంగా దాన్ని ఎంటర్టైన్ అవుతూ చూస్తారని.. ఎంజాయ్ చేసేవారని చాలా తక్కువ టైంలో సినిమాను ముగించడం ఒకటే సినిమాకు మైనర్ మైనస్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది మైనస్ అనడం కంటే రివ్యూగా వచ్చినది బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పొచ్చు. ఇక 2025 మార్చాను 28న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయానున్నారు టీం.