టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సమంత.. గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నా.. పాపులారిటీ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. నాగచైతన్యతో వివాహం, విడాకుల తర్వాత తన లైఫ్ స్టైల్ మార్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది సమంత.
ఇక విడాకుల తర్వాత చైతు డిసెంబర్ 2024న నటి శోభిత దులిపాళ్లను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత రెండో పెళ్లికి సంబంధించిన రకరకాల వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. అందులో భాగంగానే ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్‌తో సమంత కలిసి పనిచేసిన రాజ్ అండ్ డీకే ద్వేయం లో ఒకరైన రాజ్ నిడమొరుతో ప్రేమాయణం నడుపుతున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఓ మేజర్ రూమర్ ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఆమె చేతికి ఓ స్పెషల్ డైమండ్ రింగ్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సీక్రెట్ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పికిల్‌బాల్ టోర్నమెంట్‌లో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని చట్టపట్టలేసుకుంటూ జంట తిరిగిన పిక్స్ వైరల్ అయ్యాయి. ఆ సమయంలో సమంత పై డేటింగ్ వార్తలు వినిపించినా.. ఈ వార్తలు వచ్చిన మరికొద్ది రోజుల్లోనే సామ్.. రాజ్‌తో కలిసి ఓ పార్టీలో మెరిసింది. ఇలా నెల వ్యవధిలోనే రెండుసార్లు ఇద్దరు కలిసి జంటగా చట్టాపట్టాలేసుకుంటు తిరిగిన పిక్స్ వైరల్ కావడంతో.. ఈ రూమర్స్ మరింత అజ్యం పోసినట్లు అయింది. అయితే.. నిజంగానే సమంత, రాజ్ నిడమాకు సీక్రెట్ ఎంగేజ్మెంట్ అయిందా.. లేదా అని దానిపై వాళ్లే క్లారిటీ ఇస్తే కానీ ఈ వార్తలకు చెక్ పడేలా లేదు. ఇక ఇప్పటివరకు వారిద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ వచ్చిన వార్తలు పై అటు శ్యామ్ కానీ.. ఇటు రాజ్ నిడమోరు కానీ రియాక్ట్ కాలేదు.