నేషనల్ క్రష్ రష్మిక మందన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల తాను నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడమే కాదు.. ఇప్పటివరకు చివరిగా ఆమె నటించిన మూడు సినిమాలు.. మూడు వేల కోట్ల కలెక్షన్లను దాటి రికార్డును క్రియేట్ చేశాయి. పుష్ప సినిమాతో శ్రీవల్లి పాత్రలో నటించి ఆకట్టుకున ఈ అమ్మడు పుష్ప.. శ్రీవల్లి, అనిమల్.. గీతాంజలి, ఛావా.. మహారాణి యేసు బాయి గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మూడు పాన్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
బాలీవుడ్ టాప్ హీరోయిన్లకు సైతం దక్కని క్రేజ్ ఈ అమ్మడి సొంతమైంది. దీంతో ఏడాదికి కోట్లల్లో కూడబెడుతూ.. లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడి ఆస్తుల వివరాలు నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. 28 ఏళ్ల రష్మిక మందన.. ప్రస్తుత నికర ఆస్తుల విలువ రూ.66 కోట్లని సమాచారం. బన్నీ.. నటించిన పుష్ప 2 ది రూల్ మూవీకి ఆమె ఏకంగా రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇక రష్మిక ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుందని తెలుస్తుంది. అంతేకాదు.. బ్రాండ్ ఎండార్స్మెంట్లకు యాడ్లకు, ఈవెంట్లకు.. ఇలా తదితర అంశాలపై మరిన్ని ఆదాయాలను సంపాదించుకుంటుంది.
రష్మిక పేరుపై ఇప్పటికే బెంగళూరులో రూ.8 కోట్ల విలువైన ఓ బంగ్లా.. ముంబై, గోవా, కూర్గ్ మరియు హైదరాబాద్‌లోను స్థిరాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రష్మిక మందన ఏడాది సంపాదన చూస్తే ఖచ్చితంగా ఎవరికైనా ఫ్యుజ్‌లు ఎగిరిపోవాల్సిందే. అంటే దాదాపు రష్మిక ఏడాదికి రూ.50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తుందట. బాలీవుడ్‌లో చూసుకుంటే.. ఒకప్పుడు గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా టాప్.. ఇక ప్రియాంక హాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత ఆమె స్థానం దీపికా పదుకొనే దక్కించుకుంది. దీపిక బాక్స్ ఆఫీస్ ను ఇప్పటికి శాసిస్తుంది. ఇప్పుడు.. రష్మిక, దీపిక పదుకోనెకు గట్టి పోటీ ఇస్తుంది.