ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన కృష్ణవంశీ.. ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే.. కృష్ణవంశీ ఎప్పటినుంచో అల్లూరి సీతారామరాజు బయోపిక్ పై ఫోకస్ చేశాడట. గతంలో ఆయన వందేమాతరం పేరుతో ఓ భారీ దేశభక్తి సినిమాను చిరుతో తీయాలని ఆరట పడ్డారు. కానీ.. అది సక్సెస్ కాలేదు. అలాగే బాలయ్యతో రైతు సినిమా ప్లాన్ చేసిన అది కార్యరూపం దాల్చలేదు. కాగా.. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు బయోపిక్ చేయాలనే ఆలోచనలో కృష్ణవంశీ ఉన్నట్లు వివరించారు. ప్రముఖ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్‌తో కలిసి కృష్ణవంశీ అనకాపల్లి జిల్లా.. గోల్కొండ మండలం.. మేజర్ పంచాయతీ ఏజెన్సీ లక్ష్మీపురం గ్రామానికి సోమవారం వెళ్ళాడు.
అక్కడ అల్లూరి సీతారామరాజు, గంటల దొర సమాధులను సందర్శించిన కృష్ణవంశీ.. అక్కడ కొంత సమయం గడిపిన తర్వాత అల్లూరి సీతారామరాజు నడియాడిన ప్రాంతాలను సందర్శించానని.. చిన్ననాటి కోరిక ఇప్పటికీ తేరిందంటూ చెప్పుకొచ్చాడు. దాదాపు 20 సంవత్సరాల పరిశోధన తర్వాత అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర గ్రంథస్తం చేశానని కృష్ణవంశీ వివరించారు. ఆయన తిరిగిన అన్ని ప్రదేశాలను చూడాలని కోరిక మరింత బలపడిందని.. ఆయన జీవితాన్ని బేస్ చేసుకుని ఓ బయోపిక్ ను నిర్మించాలని ఆలోచన తనకు ఎంతో కాలంగా ఉందంటూ వివరించాడు. ఇక యండమూరి – కృష్ణవంశీ గురించి మాట్లాడుతూ దేశభక్తిని పెంపొందించే సినిమాలు దర్శకుడుగా కృష్ణవంశీ పై నాకు ఎంతో గౌరవం ఉందని.. ఆయన తీసిన ఖడ్గం నాకు ఎంతో ఇష్టమంటూ చెప్పుకొచ్చాడు.
అయితే కృష్ణవంశీ బయోపిక్ గురించి మాట్లాడటంతో దీనికి హీరోగా ఎవరిని పెట్టి సినిమా చేస్తారని అంశం హాట్ టాపిక్ గా మారింది. చిరుతో వందేమాతరం తీయలేకపోయినా.. ఆయన తనయుడు రాంచరణ్ తో అయినా అల్లూరి సీతారామరాజు స్టోరీని చేస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రశాంత్ డైరెక్షన్లో చరణ్ గోవిందుడు అందరివాడే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినా టీం కైతే మంచి పేరు వచ్చింది. మూవీ మ్యూజికల్ హిట్ అయ్యింది. ఈ క్రమంలోనే త్రిబుల్ ఆర్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో నటించి మెప్పించిన చరణ్.. కృష్ణవంశీ తెరకెక్కించబోయే ఫుల్ లెన్త్ అల్లూరి సీతారామరాజు స్టోరీలో హీరోగా నటిస్తే బాగుంటుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.