తెలుగులో ఎన్నో సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్ గా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సోను సూద్.. బాలీవుడ్లను అడపాదడపా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇక లాక్ డౌన్ టైంలో ఆయన చేసిన సహాయం వర్ణనతీతం. ఎంతోమంది నిరుపేదలకు రియల్ హీరోగా నిలిచాడు సోనుసూద్. ఇప్పటికి ఎంతో మంది సహాయాని అందిస్తూ లోలాది మంది ప్రసంసలు అందుకుంటున్నాడు.
అయితే తాజాగా సోనుసూద్ భార్య సోనాలి ప్రయాణిస్తున్న కార్‌కు యాక్సిడెంట్ జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ప్రమాదానికి గురయ్యారు. ముంబై, నాగపూర్ హైవేపై ఈ సంఘటన చోటుచేసుకుంది. సోనాలి డ్రైవ్ చేస్తున్న కార్.. ట్రక్‌ను ఢీకొట్టడంతో.. కారులో ఉన్న సోనాలి, ఆమె చెల్లి కూతురికి తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. అయితే ఎలాంటి ప్రాణాపాయం లేదని.. ఆ గాయాలకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం.
సోనుసూద్ కుటుంబ విషయానికి వస్తే.. 1996లో సోనాలిని వివాహం చేసుకున్నాడు. ఈమె ఓ తెలుగమ్మాయి కావడం విశేషం. వీళ్లకు అయాన్, ఇషాన్ అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. సోను భార్య ప్రస్తుతం మూవీ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది.