స్టార్ నటుడు షిహనీ హుస్సేన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన మార్షల్ ఆర్ట్స్ గురువుగానే కాకుండా.. నటుడుగాను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించిన హుస్సేనీ దగ్గరే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వరకు ఎంతో మంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ముఖ్యంగా పవన్ హుస్సేనీ దగ్గర కరాటే, కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుని బ్లాక్ బెల్ట్ అందుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ ట్రైనింగ్‌లో తన గురు అయిన హుస్సేనీ మరణ వార్త విని ఆవేదనకు లోనైనట్లు పవర్ స్టార్ చెప్పుకొచ్చాడు.
అంతేకాదు ఆయన వద్ద నేను కరాటే శిక్షణ పొందా.. నా మార్షల్ ఆర్ట్స్ గురువు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఇటీవల నాకు తెలిసింది.. వెంటనే చెన్నైలోన్ని నా ఫ్రెండ్ కి చెప్పి మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకుని వెళ్ళమన్నా.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే ఈ దారుణం జరిగిపోయింది అంటూ పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ నెల 29న చెన్నై వెళ్లి హుస్సేనీ పరామర్శించాలని నిర్ణయించుకున్నానని.. ఇంతలో ఈ దుర్ఘటన జరగడం బాధాకరమంటూ వెల్లడించాడు. ఇక హుస్సేనీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు.
ఇక 60 ఏళ్ల హుసేని గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఇక బ్లడ్ క్యాన్సర్ అని.. చివరి స్టేజ్ అని తెలిసిన హుస్సేనీ తన ప్రియ శిష్యుడు పవన్ కళ్యాణ్, విజయ్ లకు చివరి కోరికలు తెలియజేశారు. తన శిక్షణ కేంద్రం ఉన్న భవనాన్ని తన ప్రియ శిష్యుడైన పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ కేంద్రంగా కొనసాగించాలంటూ కోరుకున్నడట. అంతేకాదు.. విజయ్ తమిళనాడులోని ప్రతి ఇంట్లో ఒక్క ఆర్చరైన ఉండేలా చూసుకోమంటూ అభ్యర్థించినట్లు తెలుస్తుంది.