నాగచైతన్య నెక్స్ట్ సినిమాకు ఆ విచిత్రమైన టైటిల్.. ఇదెక్కడి హారర్ టైటిల్ రా సామి..!

ఇండస్ట్రీలో వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న అక్కినేని నాగచైతన్య.. తాజాగా తండేల్‌తో బ్లాక్ బస్టర్ కొట్టి పాటలు, డ్యాన్స్‌తో పాటు నటన పరంగాను ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ క్ర‌మంలోనే సినిమాకు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో పాటు.. కలెక్షన్ల పరంగాను మంచి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత చైతన్య ఇదే సక్సెస్ సీక్రెట్ ని కొనసాగిస్తాడా.. లేదా.. అనేది ఆడియన్స్ అందరిలోనూ పెద్ద సందేహంగా మారింది. ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యాన్స్ అంతా అభిమానులను కూడా దృష్టిలో పెట్టుకొని వారి ఇష్టానికి తగ్గట్లుగా సినిమాలు చేయాలని.. ఆచితుచి అడుగులు వేయాలంటూ నాగచైతన్యకు సజెషన్స్ ఇస్తున్నారు.

Official: Thandel locks its release date

ఇలాంటి క్రమంలో విరుపాక్ష బ్లాక్ బస్టర్ అందుకున్న.. డైరెక్టర్ కార్తీక్ దండు సినిమాకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది ఓ హార‌ర్ మూవీ. ఇక ఇప్పటివరకు కేవలం యూత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న చైతు.. మొట్టమొదటిసారి హారర్ జానార్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. నిజానికి ఆయన అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూత.. అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను మెప్పించాడు. అది వెబ్ సిరీస్ క్యాటగిరీలో వస్తుంది కనుక.. ఇప్పటివరకు చైతు సినీ కెరీర్‌లో ఒక హారర్ సినిమా కూడా నటించనట్లే. ఈ క్రమంలోనే విరుపాక్ష ఫ్రేమ్ కార్తీక్ దండుతో మొట్టమొదటి హారర్ సినిమాకు సిద్ధమవుతున్నాడు.

Naga Chaitanya Teaming With Karthik Dandu | cinejosh.com

ఇక విరుపాక్షతో ఆడియన్స్ను విపరీతంగా భయపెట్టిన కార్తీక్.. ఇప్పుడు నాగచైతన్య సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాడో వేచి చూడాలి. సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా నిలిచింది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు వృష కర్మ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అటవీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హారర్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందనుంద‌ని.. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి కనిపించనుంద‌ని.. ఈ ఏడాది చివరికల్లా పక్క ప్రణాళికతో కార్యక్రమాలు అన్నింటిని పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు సినిమాని తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్. ఇక ఇప్పటివరకు పాన్‌ ఇండియా లెవెల్‌లో హారర్ కాన్సెప్ట్ తో ఒక్క సినిమా కూడా తెర‌కెక్కలేదు. ఒకవేళ ఈ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ అందుకుంటే మాత్రం.. మరోసారి టాలీవుడ్ వైపు సినీ ఇండస్ట్రీ అంతా తిరిగి చూస్తుందనటంలో సందేహం లేదు.