టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ ప్రారంభం నుంచి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తే తను చేసిన ప్రతి సినిమా తను బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఇంటర్నేషనల్ లెవెల్ లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న జక్కన్న.. తను తీసే ప్రతి సినిమాకు మినిమం 4 ఏళ్ల సమయాన్ని తీసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన హీరోల విషయంలోనూ చాలా సెలెక్టివ్ గా ఉంటున్నారు. ఇప్పటివరకు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను గ్లోబల్ స్టార్‌లుగా మార్చిన జక్కన.. రవితేజ, నాని, సునీల్, నితిన్ లాంటి హీరోలతోనూ సినిమాలను తెరకెక్కించి సక్సస్ అందుకున్నాడు.
కాగా.. జక్కన్న ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ బిగ్ బడా పాన్ వరల్డ్ ప్రాజెక్టులో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు జక్కన్న. అయితే దాదాపు టాలీవుడ్ లో ఉన్న పెద్ద హీరోల అందరితో సినిమాలో తీసిన ఆయన అల్లు అర్జున్‌తో మాత్రం ఒక సినిమాను కూడా తెరకెక్కించలేదు. ఇప్పటివరకు వీరి కాంబినేషన్ అసలు సెట్ కాలేదు. యంగ్ హీరోల్లో, పెద్ద హీరోలు అందరితోనూ బూవీస్ చేసిన రాజమౌళి.. అల్లు అర్జున్‌తో సినిమా చేయకపోవడం వెనక ఒక షాకింగ్ రీజన్ ఉందట.. అదే బన్నీ తండ్రి అల్లు అరవింద్.
మగధీర సినిమా టైంలో చేసినా ఒక పని అని.. దాని వల్లే బన్నీతో ఇకపై సినిమా చేయకూడదని జక్కన్న ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో చరణ్ హీరోగా.. మగధీర సినిమా తెరకెక్కి ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. దీనికి అల్లు అర్జున్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా రిలీజ్ టైంలో అల్లు అరవింద్.. రాజమౌళిని తక్కువ చేసి మాట్లాడారట. చిరు కొడుకు కనుక ఈ సినిమా బిజినెస్ అయింది. లేదంటే.. చాలా కష్టమై ఉండేది అంటూ ఆయన కామెంట్స్ చేస్తారట. రాజమౌళి ఎక్కువ బడ్జెట్ చేశాడని.. అప్పు చేయాల్సి వచ్చిందంటూ రాజమౌళిని చులకనగా మాట్లాడాడట. దీంతో హర్ట్ అయిన రాజమౌళి అల్లు ఫ్యామిలికి దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌తో ఇప్పటివరకు తన కెరీర్ లో ఒక్క సినిమాను కూడా రాజమౌళి చేయలేదట.