టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు సినిమా దాదాపు రెండు దశాబ్దాల క్రితం రిలీజై ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఇక ఈ సినిమాలో నాగార్జునకు జంటగా అన్షు ఓ ప్రధాన పాత్రలో మెరిసింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తర్వాత ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అన్షు.. ఈ సినిమాలోని తన నటనతో మెప్పించింది. అయితే ఇది పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో.. తర్వాత అవకాశాలు రాక మెల్లమెల్లగా ఇండస్ట్రీకి దూరమైంది. ఈ క్రమంలోనే దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల రిలీజ్ అయిన సందీప్ కిషన్ మజాకా సినిమాలో అన్షు ఓ కీలక పాత్రలో నటించింది.
త్రినాధరావు నక్కిన డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో.. సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా మెరువగా.. రావు రమేష్ ప్రేయసిగా అన్షు మాలిక నటించి ఆకట్టుకుంది. కానీ.. ఈ సినిమా కూడా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. అయితే.. అన్షు మాత్రం ఇన్నేళ్ల తర్వాత ఇండస్ట్రీలో నటించడం ఫ్యాన్స్‌కు కాస్త సర్ప్రైజింగ్ అనిపించింది. ఇదిలా ఉంటే.. లేటెస్ట్‌గా అన్షుకు సంబంధించిన షాకింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. నెలరోజుల క్రితం తనకు గాయమైందని.. తలకు కుట్లు కూడా పడ్డాయి అంటూ అన్షు స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.
ఫిబ్రవరి 26న సందీప్ కిషన్ మజాకా సినిమా రిలీజ్ కాగా.. ఈ ప్రమోషన్స్ కోసం మొన్నటి వరకు ఇండియాలోనే ఉన్న అన్షుకి ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలియలేదు కానీ.. సోషల్ మీడియాలో స్వయంగా ఆమె ఈ విషయాన్ని షేర్ చేసుకోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆమెకు ఏం జరిగింది.. ఇప్పుడు ఎలా ఉంది అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి.
అయితే అన్షు ఈ సోషల్ మీడియా పోస్ట్ లోనే.. గాయపడిన తనని తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చూసుకున్నారని.. తాను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను అంటూ వివరించింది. ఇక మన్మధుడు తర్వాత మజాకా సినిమా కోసం ఎందుకు రీ ఎంట్రీ ఇచ్చిందో తెలియదు కానీ.. మళ్ళీ మజాకా సినిమా రిలీజ్ అయిన వెంటనే తాను అమెరికా వెళ్లిపోవడంతో అంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. అన్షు గాయానికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియలేదు. ఇక మజాకాతో రీఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మన్మధుడు సినిమా టైంలో ఎలాంటి గ్లామర్ తో ఆకట్టుకుందో.. అదే రేంజ్‌లో గ్లామరస్ లుక్‌లో మజాకా సినిమాలోను ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసింది.