తారక్ డ్రాగన్ తర్వాత దేవర 2 కాదట.. లైనప్ లోకి ఆ క్రేజీ డైరెక్టర్..!

టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో క్రేజీ ప్రాజెక్టులతో రాణిస్తున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో నేషనల్ లెవెల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న తారక్.. చివరిగా దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి మల్టీ స్టార‌ర్ సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వార్ 2 షూట్‌ పూర్తయిన వెంటనే.. డ్రాగన్ సినిమా సెట్స్‌లో సందడి చేయనున్నాడు తారక్. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈరెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ కొరటాలతో దేవర కంటిన్యూషన్ గా.. దేవర పార్ట్ 2 సినిమాలో నటిస్తాడంటూ వార్తలు వినిపించాయి.

Prashanth Neel Title Options: 'Enter the Dragon' & 'NTR the Dragon'

అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డ్రాగన్ తర్వాత మరో క్రేజీ డైరెక్టర్ కాంబినేషన్‌లో ఈ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు జైలర్ లాంటి బ్లాక్ బస్టర్‌తో సౌత్‌లోనే కాకుండా.. పాన్ ఇండియా లెవెల్లో డైరెక్టర్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నెల్సన్ దిలీప్ కుమార్. ఇప్పటికే నెల్సన్.. ఎన్టీఆర్ కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌సిద్ధం చేసేసాడట. ఇందులో మాస్, యాక్షన్, కామెడీ అన్ని అంశాలను కలగలుపుతూ కథను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక నెల్సన్ సినిమాల్లో సీరియస్ టోన్‌ ఉన్నా.. కథలో ఫన్ మూమెంట్లు క్రియేట్ చేస్తూ త‌న‌కంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.

NTR – Nelson | 'జైల‌ర్' ద‌ర్శ‌కుడితో ఎన్టీఆర్ మూవీ.?-Namasthe Telangana

ఇది జైలర్ సినిమాతో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న నెల్సన్.. ఇదే ఫార్మ‌లాను ఎన్టీఆర్ సినిమా కోసం కూడా అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ విషయంలో.. తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారుతుంది. ఈ ప్రాజెక్టుకు రాక్ అనే టైటిల్ ఫిక్స్ చేసారట టీం. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా పాన్ ఇండిచ‌న్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా.. ఈ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే.. ఈ సినిమా దేవర 2 తర్వాత ఉంటుందని అంత భావించారు. తాజా అప్డేట్ ప్రకారం.. డ్రాగన్ సినిమా తర్వాత ఈ షూట్‌ను సితార ఎంటర్టైన్మెంట్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఈ సినిమాకు సంబంధించిన చర్చలు పూర్తిచేసి.. ఈ ఏడాది చివర్లో ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి.. 2026 లో సినిమా సెట్స్‌ పైకి వచ్చేలా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.