ఆ మాస్ హీరో కోసం కెరీర్‌లో ఫస్ట్ టైం అలాంటి పనికి ఒప్పుకున్న బాలయ్య..!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్న బాలయ్య.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే బాలయ్యను అభిమానించే సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అంతేకాదు బాలయ్య పేరు చెప్తే భయపడేవారు కూడా ఉన్నారు. ఆయన చాలా కోపం.. ఇట్టే కోపం వచ్చేస్తుందంటూ కొన్ని కామెంట్లు కూడా ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే సన్నిహితులు మాత్రం బాలయ్య‌ది చిన్నపిల్లల మనస్తత్వమని.. త‌న ఎదురుగా ఎవరైనా మంచి పని చేస్తే శభాష్ అని చెప్పడం.. చెడ్డ పని చేస్తే నా కొడకా అని తిట్ట‌డం.. కుండబద్దలు కొట్టినట్లు ఏదైనా చెప్పేసే వ్యక్తిత్వం అని చెబుతూ ఉంటారు.

Ravi Teja, Balakrishna come together for chirpy chat on 'Unstoppable with  NBK' - Telugu360

అయితే హీరోగా నటిస్తూనే బాలయ్య ఇటీవల కాలంలో హోస్ట్‌గా మారి అన్ స్టాపబుల్ షో ను సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటివరకు నాలుగు సీజన్లను పూర్తిచేసిన ఈషో ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్‌లో హైప్ తెచ్చుకుంది. కాగా ఇప్పుడు బాలయ్య మరో సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడని.. అది కూడా ఓ ఊరనాటు మాస్ హీరో కోసం ఇప్పటివరకు తన కెరీర్లో చేయని ఓ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. బాలయ్య తన సినీ కెరీర్‌లో ఫస్ట్ టైం గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడట. ఇక బాలయ్య.. ప్రస్తుతం అఖండ 2 తాండవంతో బిజీగా గడుపుతున్నాడు.

Balayya Sets a New Record with Salary?

ఈ సినిమా అయిన వెంటనే బాలయ్యతో సినిమా చేయడానికి దర్శకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య ఆచితూచి అడుగులు వేస్తున్నారని.. ఇప్పుడు బాలయ్య ఒక హీరోగా సినిమాలో గెస్ట్ పాత్ర చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇంతకీ ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసిన మాస్ హీరో మరెవరో కాదు రవితేజ. గోపీచంద్ మలినేని, రవితేజ కాంబోలో సినిమా ఫిక్స్ అయిందంటూ టాక్ నడుస్తుంది. కాగా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలయ్యను అప్రోచ్ అయ్యారట టీం. ఇక బాలయ్య.. గోపీచంద్ పై ఉన్న అభిమానంతో ఆ పాత్రలు నటించడానికి ఓకే చేసినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే న్యూస్ పెట్టిండా వైరల్ గా మారడంతో.. నిజంగానే బాలయ్య, రవితేజ కాంబోలో సినిమా వచ్చిందంటే ఇక దానికి తిరుగు ఉండదని బాక్సాఫీస్ బ్లాస్ట్ కాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.