టాలీవుడ్ స్టార్ నటుడిగా తిరుగులేని ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న సునీల్.. ప్రస్తుతం ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో కమెడియన్, తర్వాత హీరో, ఇప్పుడు వీలన్.. ఇలా అన్ని రకాల పాత్రలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు సునీల్. ఇక పుష్ప ఫ్రాంచైజ్ సినిమాల్లో విలన్ గా నటించి తన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలు చేస్తూ.. అప్పుడప్పుడు ఆయన మెయిన్ లీడ్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
ఈ క్రమంలోని తాజాగా సునీల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. ఇందులో భాగంగా ఇంట్రెస్టింగ్ విషయాలను.. ముఖ్యంగా ఏ హీరో బాగా సపోర్ట్ చేస్తారు ఇండస్ట్రీలో అనే ప్రశ్నకు సునీల్ చెప్పిన షాకింగ్ సమాధానం అందరినీ ఆకట్టుకుంది. ఇక మొదట సపోర్టీవ్ హీరో ఇండస్ట్రీలో చిరంజీవి అంటూ చెప్పుకొచ్చిన సునీల్.. చిరు తర్వాత అదే స్థాయిలో అందరికీ సపోర్ట్ చేసే వ్యక్తి నాని అని.. తాను ఎంత బిజీగా ఉన్నా సరే ఓ సినిమా ఫంక్షన్కు పిలిస్తే చాలు కచ్చితంగా రెస్పాండ్ అవుతాడని వివరించాడు.
తన షూటింగ్ ఏ రోజు ఉంది.. ఏ టైం దాకా షూటింగ్లో ఉండి.. ఫంక్షన్‌కు ఏ టైం కి వస్తాడు అనేది కూడా పూర్తిగా చూసుకొని వివరిస్తాడని.. సునీల్ చెప్పుకొచ్చాడు. ఇక స్టార్ హీరోగా మారిన తర్వాత.. ఎదుటివారికి అంత క్లియర్ గా అన్ని వివరించాల్సిన అవసరం ఉండదు. కానీ.. నాని దానిని బాధ్యతగా భావిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. అతను ఖచ్చితంగా ఏదో రోజు స్టార్ట్ డైరెక్టర్ గా ఎదుగుతాడు అంటూ సునీల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోని నాని ఫ్యాన్స్ సునీల్ కామెంట్స్ పై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కామెంట్స్ నూటికి నూరుపాళ్లు నిజమని.. ఎలాంటి గర్వం లేకుండా ఇండస్ట్రీలు అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నాని ఒకేలా ఉన్నాడు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.