సినీ ఇండస్ట్రీలో లవ్, ఎఫైర్స్, బ్రేకప్, పెళ్లిళ్లు, విడాకులు ఇవన్నీ సర్వసాధారణం. ఎప్పటికప్పుడు వీటిపై ఎన్నో వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి వార్తలు టాలీవుడ్ కంటే ఎక్కువగా బాలీవుడ్లో వినిపిస్తూ ఉంటాయి. బాలీవుడ్ హీరో, హీరోయిన్ల మధ్యన రొమాన్స్ రూమర్లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అలా గతంలో హీరో కారణంగా మరో హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిందని.. గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకుంది అనే వార్తలు కూడా ఎన్నోసార్లు వినిపించాయి.
అలాంటి ఓ న్యూస్.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ బడా ఫ్యామిలీకి చెందిన ఓ హీరో తనతో నటించిన హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపాడని.. సదరు హీరోయిన్ కూడా అతనితో ప్రేమలో మునిగితేలుతుందంటూ టాక్ వైరల్ గా మారింది. కాగా హీరోయిన్ ఇంటికి హీరో వెళ్లడం.. హీరో ఇంటికి హీరోయిన్ వెళ్లడం ఇక లివిన్ రిలేషన్షిప్ లోను ఉన్నారని సమాచారం.
ఈ క్రమంలోనే హీరోయిన్ ప్రెగ్నెంట్‌గా మారడంతో.. ఆ హీరో తనను పెళ్లి చేసుకోవాలని భావించిందట. కానీ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. ఆ బడా హీరో రిలేషన్ కు గుడ్ బై చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాడట. ఇందులో భాగంగా.. హీరోయిన్‌కు అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి పెట్టడంతో పాటు.. రెండు కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు వస్తే కుటుంబం పరువు పోతుందని హీరోయిన్‌ను తెగ బతిమిలాడేస్తున్నాడట. అయితే.. ఆ హీరోయిన్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే అంశం హాట్ టాపిక్ గా మారింది.