ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదట విలన్ పాత్రలో నటించి.. తర్వాత హీరోగా మారిన చిరు.. తన ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే ఆయన కెరీర్లో కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. కాగా తన సినీ కెరీర్‌లో ఒకే ఫ్యామిలీకి చెందిన రియల్ లైఫ్ అక్క, చెల్లెలు ఎంతమందితో చిరు నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలా ఇప్పటివరకు తన సినిమాల్లో రొమాన్స్ రియల్ లైఫ్ అక్క, చెల్లెళ్ల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
జ్యోతిక, నగ్మా , శ్రీదేవి:
అతిలోకసుందరి శ్రీదేవి, చిరంజీవిలది ఎంత గొప్ప బ్లాక్ బస్టర్ పెయిరో.. ఎన్ని సినిమాలతో సక్సస్ అందుకున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే శ్రీదేవి కజిన్ సిస్టర్స్ నగ్మ, జ్యోతికలతోను చిరంజీవి నటించి ఆకట్టుకున్నాడు. నగ్మాతో ఘరానా మొగుడు సినిమాలో నటించగా.. జ్యోతిక తో ఠాగూర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.
రాధిక, నిరోషి:
ఇక సీనియర్ హీరోయిన్ రాధిక, చిరంజీవి సినిమాలకు తిరుగులేని క్రేజీ ఉండేది. వీరి అంబాలో.. దొంగ మొగుడు, న్యాయం కావాలి ఇలా ఎన్నో సినిమాలు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే చిరంజీవి.. రాధిక సిస్టర్ నిరోషాతోను స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమాల్లో నటించాడు.
రాధా, అంబిక:
స్టార్ హీరోయిన్ రాధ, చిరు కాంబోలో నాగ, దొంగ, ప్రాణం, రక్త సింధూరం ఎలా ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాగే రాధా చెల్లి అంబికతోను.. చిరంజీవి యముడికి మొగుడు సినిమాలో చిందేశాడు. ఎలా ఇద్దరు అక్కచెల్లెళ్లతోనే చిరు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.
శృతిహాసన్, సుహాసిని:
సీనియర్ స్టార్ హీరోయిన్ సుహాసిని, చిరంజీవి కాంబోకు అస్సలు పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరి కాంబో అప్పట్లో మంచి క్రేజీ కాంబో. ఆరాధన, గురువుకు తగ్గ శిష్యులు, కిరాతకుడు, చంటబ్బాయి దొరికేశాడు ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన మెప్పించారు. అయితే సుహానికి పాన్ స్టార్ట్ బ్యూటీ శృతిహాసన్ కాజిన్ సిస్టర్ అవుతుందన్న సంగతి చాలామందికి తెలిసి ఉండదు. అయితే శృతిహాసన్ తోనూ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో నటించాడు.
జయసుధ, సుభాషిని:
ఇండస్ట్రీలో ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ పలుకులకు పాత్రలో నటిస్తున్న జయసుధ ఒకప్పుడు హీరోయిన్గా ఎంతమంది స్టార్ హీరోలతో నటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనూ చిరంజీవితో పలు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ అమ్మడు కథ జయసుధ చెల్లి సుభాషినితో కూడా చిరంజీవి ఆరని మంటలు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు