బన్నీ కి ఘోర అవమానం.. వాడి మొఖానికి అంత సీన్ లేదంటూ నిర్మాత షాకింగ్ కామెంట్స్..!

సినీఇండస్ట్రీలో ఏదైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసే వ్యక్తులు చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు. మనిషి ఉన్నప్పుడు ఒకలా నటిస్తూ.. మనుషులు లేనప్పుడు మరోలా మాట్లాడే వ్యక్తులు రియల్ లైఫ్ లో చాలామంది ఎదురవుతూ ఉంటారు. అయితే సాధారణ జనంలోనే కాదు.. బడాబ‌డా బిగ్‌ ఫ్యామిలీల‌లో.. స్టార్ సెలబ్రిటీలుగా రాణిస్తున్న వారిలో కూడా అలాంటివారు చాలా మందే ఉంటారట‌. అలా ఇప్పటివరకు అనవసరంగా మాటలు పాడిన వారిలో ఇండస్ట్రీ బిగ్ బడా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ కూడా ఒకడు. ఇక అల్లు అర్జున్ తన సినీ కెరీర్‌లో ఎంతోమందితో అనవసరంగా మాటలు పడాల్సి వచ్చిందట.

ముఖ్యంగా గంగోత్రి టైంలో బన్నీని చాలా చాలా దారుణంగా మాట్లాడుతూ కొంతమంది అవహేళన చేశారట. ఈ క్రమంలోనే ఓ ప్రొడ్యూస‌ర్‌.. బ‌న్నీని హీరోగా ఇంటర్వ్యూస్ చేయాలని అడిగేందుకు వెళ్ళగా.. ఎవరు ఆ బ‌క్కోడా.. వాడు హీరో ఏంటి.. వాడికి అసలు అంత సీన్ లేదు.. అంటూ చీప్ గా మాట్లాడుతూ ఘోరంగా అవమానించాడట. అప్పట్లో ఇది హాట్ టాపిక్. అయితే అప్పటికి బ‌న్నీకి ఈ రేంజ్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు.. ఏదో అప్పుడప్పుడు చిరు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెరుస్తూ ఉండేవాడు తప్ప.. హీరోగా ఇండస్ట్రీలోకి అదే ఫ‌స్ట్ ఎంట్రీ.

అలా కచ్చితంగా ఎవరో ఒకరు మాటలు అంటూనే ఉంటారని లైట్ తీసుకున్నారు అభిమానులు. అయితే అల్లు అర్జున్ తర్వాత స్టార్ హీరోగా తిరుగులేని రేంజ్ కు ఎదగ‌డంతో అదే బ‌డా నిర్మాత.. బన్నీతో సినిమా కోసం ఆయన ఇంటి చుట్టూ తిరుగుతూ పడిగాపులు పడ్డేలా చేసుకున్నాడు. ఇక తాజాగా పుష్ప 2 లాంటి సాలిడ్ హీట్‌తో ఆయన రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్‌కు ఎదిగింది. ఏ రేంజ్ లో అల్లు అర్జున్ పేరు మోగిపోయింది అందరికి తెలుసు. కాగా ప్రస్తుతం బన్నీ టెక్స్ట్ సినిమా అట్లీ డైరెక్షన్లో ఉండబోతుందని.. ఉగాది రోజు సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్లు మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.