టాలీవుడ్ బడ బ్యాక్గ్రౌండ్.. స్టార్ ఫ్యామిలీస్‌లో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి. ఇక ఇటీవల కాలంలో మంచు ఫ్యామిలీ సినీ వార్తల కంటే.. పర్సనల్ వివాదాలతోనే ఎక్కువగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య ఆధిపత్య పోరు ఏ రేంజ్ లో కొనసాగిందో చూశాం. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసులు పెట్టుకునేంతగా వివాదం ముదరడంతో.. పోలీసులు వివాదాన్ని సద్దమనిగేలా చేశారు. ఇలాంటి క్రమంలో తాజాగా మంచు విష్ణు అతని భార్య వేరోనికాకు విడాకులు ఇచ్చేస్తున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
రీసెంట్గా మంచు విష్ణు.. కన్నప్ప సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో సినిమాపై ఫ్యామిలీ మొత్తం భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్వరలో రిలీజ్ కానున్న సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా మంచు ఫ్యామిలీ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ, తన పిల్లల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఇక ప్రస్తుత లైఫ్ స్టైల్ లో చాలా జంటలు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే కంటున్నారు. కానీ.. మంచు విష్ణుకు మాత్రం ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నా ఇంకా పిల్లలు కావాలని అనుకున్నాడట. ఇదే విషయాన్ని భార్య వీరోనికకు చెప్పగా.. ఆమె భయపడి ఇంకా పిల్లలా నా వల్ల కాదు బాబోయ్.. నీకు ఇంకా పిల్లలు కావాలంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో.. అందని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అవుతున్నాయి.