ఇండస్ట్రీలో బడ్జెట్, స్టార్ కాస్టింగ్‌తో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఆడియన్స్‌కు బ్రహ్మరధం పట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలా పెద్దగా స్టార్ కాస్టింగ్ లేకపోయినా.. ఆశిక్ అబు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ రైఫిల్ క్లబ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో సుశాన్‌గా నటి సురభి లక్ష్మి.. ప్రధాన పాత్రలో మెరవగా.. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. సీరియస్ సన్నివేశాలతో పాటు.. సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాల్లోనూ జీవించేసింది సురభి. అత్యంత కీలకమైన లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా థియేటర్లో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంది. అందువల్ల ఆ లిప్ లాక్ సీన్ ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలోనే ఓ మీడియా సంస్థకు సురభి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇటీవల రైఫిల్ క్లబ్ ముద్దు సన్నివేశాన్ని చిత్రీకించిన అనుభవాలను షేర్ చేసుకుంది. అది లిప్ లాక్ అని తనకు షూట్ రోజునే తెలిసిందంటూ వివరించిన సురభి.. మొదట సాదాసీదా ముద్దుగా భావించ అయితే అది పూర్తిస్థాయి లిప్ లాక్ అని తర్వాత తెలిసింది అంటూ వివరించింది. ప్రజెంట్ బాగా వైరల్ గా మారుతున్న ఈ లిప్ లాక్ సీన్.. రైఫిల్ క్లబ్ సినిమా క్లైమాక్స్ లో ఉంటుంది. ఇక జాతీయ అవార్డు గెలుచుకున్న సురభి మొదట అక్కడ ముద్దు సన్నివేశం ఉంటుందని తెలుసు కానీ.. లిప్ లాక్ సీన్ అని అనుకోలేదట. అయితే పూర్తిస్థాయి లిప్ లాక్ షార్ట్ అని తెలియడంతో ఆమె ఆశ్చర్యపోయిన ఆ సన్నివేశం గురించి టెన్షన్ పడకుండా.. ఎలా పండించాలని ఆలోచన చేసిందట.
ఆ సమయంలో సినిమాలు తన భర్తగా నటించినా సజీవ్ కుమార్ ఎలా ఫీల్ అయ్యాడో తెలుసుకోవాలని అనుకున్నాను. నా భర్తగా నటించిన సజీవ్‌ని టెన్షన్ గా ఉన్నవా అని అడిగా.. అయితే అతను కూడా నాలాగే ఏ టెన్షన్ పడడం లేదని వివరించడంతో సన్నివేశం బాగా రావాలని అనుకున్నా. అందుకే అతనికి సిగర్ తాగే అలవాటు ఉంది కనుక.. షార్ట్‌కు ముందు పళ్ళుతోముకని తిరిగిరమ్మని చెప్పా. అంతే కాదు.. సెట్స్ లోని ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్లకు కొన్ని యాలుకలు తీసుకురావాలని కోరా.
షార్ట్‌కు ముందు వాటిని నేను నోట్లో వేసుకున్నా. కాసేపు నమిలా అంటు వివరించింది. ఇక సాధారణంగా రొమాంటిక్ సన్నివేశాలు నటించేటప్పుడు సిబ్బంది అతి తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కారణం హీరోయిన్ కు ఇబ్బంది కలగకూడదని.. అయితే సురభి మాత్రం డిఫరెంట్ గా ప్రత్యేకమైన అంటరాని సన్నివేశంగా దీనినేమి చూడాల్సిన అవసరం లేదని.. ఆ టైంలో సెట్ లో ప్రతి ఒక్కరు ఉండేలా చూసుకుందట. తద్వారా సున్నితమైన సీన్‌కు వినోదం, స్నేహం, సరదాలను జోడించి తన ట్రేడ్ మార్క్ హాస్యంతో ఒక ఉద్విక్షణ క్షణాన్ని సెట్ లో తేలికైన మరపురాని అనుభవంగా మార్చుకున్నట్లు వివరించింది.