జపాన్‌లో లక్ష్మీ ప్రణతి బర్త్డే సెలబ్రేషన్స్.. ఎన్టీఆర్ హంగామా చూసారా..?

టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్.. చివరగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు తారక్.. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. దేవర తాజాగా జపాన్ దేశంలో రిలీజ్‌కు సిద్ధమయింది. ఇక ఈ సినిమాను మార్చి 27న అంటే మరికొద్ది గంటల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఆల్రెడీ ప్రీమియ‌ర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున తార‌క్ తాజాగా జపాన్ వెళ్లి.. అక్కడ ఫ్యాన్స్‌తో కలిసి డ్యాన్స్ స్టెప్స్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

Pic Talk: NTR Celebrates Wife Pranathi's Birthday In Japan

ఇక ఎన్టీఆర్‌కు జపాన్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. త్రిబుల్ ఆర్ కంటే ముందే ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాతో జపాన్లో విపరీతమైన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. అప్పటినుంచి తారక్ ఒక్కో సినిమాకు క్రేజ్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఈ క్రమంలోనే దేవర సినిమాను జపాన్ లో ఎగ్రేసివ్ గా ప్రమోట్ చేసేందుకు ప్లాన్ చేసిన ఎన్టీఆర్.. అక్కడ అభిమానులతో సైతం ముచ్చటించాడు. ఇక జపాన్ కు ప్రమోషన్స్ కోసం వెళ్ళిన తారక్.. తనతో పాటు భార్య లక్ష్మి ప్రణతిని కూడా తీసుకువెళ్ళాడు.

NTR Wife Lakshmi Pranathi Birthday Celebrations In Japan | Jr NTR | Dragon  | Devara

ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ బ్యూటిఫుల్ పోస్ట్ షేర్ చేసుకున్నాడు. నేడు లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు కావడంతో.. అక్కడే ఆమె బర్త్డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్గా చేశాడు. ఈ వేడుకల్లో తెగ హంగామా చేసిన తారక్.. వీరిద్దరి నడుమ ఉన్న కొన్ని హ్యాపీ మూమెంట్స్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ పిక్స్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇవి చూసిన తారక్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ ప్రణతికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు.