సినీ స్టార్ బ్యూటీ నయనతారకు సౌత్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ పాన్ ఇండియన్ స్టార్ హీరోకి ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మించిపోయేంతలా నయనతార అభిమానాన్ని సంపాదించుకుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అదే అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్ళై , ఇద్దరు పిల్లలు ఉన్న ఇప్పటికి అదే స్లిమ్, ఫిట్నెస్‌తో కుర్ర కారకు హిట్ పుట్టిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ తెగ ఎగబడిపోయి మరి ఆమెను చూడడానికి ఆరాటపడుతూ ఉంటారు.
ఆమెతో ఒక్క సెల్ఫీ దొరికితే చాలని తాపత్రయపడిపోతూ ఉంటారు. అలాంటి నయన్.. గత కొంతకాలంగా పలు కాంట్రవర్షియల్ తో సతమతం అవుతున సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెకు కాస్త నెగెటివిటీ కూడా ఏర్పడుతుంది. ఇలాంటి క్రమంలోనే.. నయనతారకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెటింట తెగ వైరల్ గా మారుతుంది. నయనతార తన కెరీర్లో దాదాపు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హిరుల అందరి సరసన నటించి మెప్పించింది. అయితే.. అందరూ స్టార్స్.. ఆమెను నయన్ , నయనతార లేదా మేడం అని పిలుస్తూ ఉంటారు. కానీ.. ఒకే ఒక్క హీరో మాత్రం ఎంతో ఎఫెక్షనేట్‌గా చెల్లి అని పిలుస్తాడట.
అతను కూడా టాలీవుడ్ స్టార్ హీరో కావడం విశేషం. ఇంతకీ అతను ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఎస్.. నయనతారను మెగాస్టార్ చెల్లి అని ఎంత ఆప్యాయంగా పిలుస్తూ ఉంటాడట. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ఎన్నో సినిమాలు తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అని నిలిచిన సంగతి తెలిసిందే. కాగా గాడ్ ఫాదర్ సినిమాల్లో.. వీళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్స్ గా కనిపించారు. ఈ మూమెంట్లోనే చిరంజీవి.. నాయన్‌ను చెల్లమ్మ అని సెట్స్‌లో తెగ ఆటపట్టించేవాడట. ఇప్పటికి నయనతారను ఏ తెలుగు హీరో చెల్లి అని కానీ.. అక్క అని కానీ పిలవడు. కానీ అలా చెల్లి అని పిలిచే ఏకైక హీరో మెగాస్టార్ మాత్రమే. నయనతారను చెల్లి అంటూ ఇప్పటికి ముద్దుగా పిలుస్తూ ఉంటాడట చిరు.