డైలమాలో ‘ అఖండ 2 ‘.. నిర్మాతలు వెనకడుడేనా..?

గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ సక్సెస్ ట్రాక్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు బ్లాక్ బ‌స్టర్లు అందుకున్న బాలయ్య సినీ గ్రోత్ గురించి మాట్లాడాలంటే.. అఖండకు ముందు అఖండ తర్వాత అని చెప్పుకోవాలి. ఆ రేంజ్‌లో బోయ‌పాటి.. బాలయ్యకు బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసాడు. ఓ విధంగా చెప్పాలంటే 2021 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాతోనే బాలయ్య గోల్డెన్ జ‌ర్ని ప్రారంభమైంది. ఈ సినిమా నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే.. ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందంటూ అభిమానులు కోరుకున్నారు. దానికి తగ్గట్టుగానే బాలయ్య, బోయపాటి.. అఖండ 2 తాండవం సెట్స్‌ పైకి వచ్చింది.

Nandamuri Balakrishna Launched Akhanda 2 Thaandavam Motion Poster | TFPC

ఇక ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే.. నిర్మాతలు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. రామ్ అచంట, అనిల్ సుంకర ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. కాగా.. ఇటీవల ఈ ఇద్దరు ప్రొడ్యూసర్లు ఏజెంట్, భోళా శంకర్ లాంటి ఘోరమైన డిజాస్టర్ లను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మధ్యలో సామజవరగ‌మన అలాంటి సూపర్ హిట్ ఉంది కానీ.. అందులో వచ్చిన లాభాలు ఈ రెండు సినిమాల నష్టాలను మాత్రం ఓవర్కం చేయలేకపోయాయి. ఇప్పుడు ఈ నిర్మాతలకు అఖండ 2 విషయంలోను కొత్త టెన్షన్ పట్టుకుందట. అదేంటంటే.. ఈ సినిమా మొదట్లో కేవలం రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని ప్లాన్ చేశారట.

Balakrishna reveals plans for Akhanda 2

కానీ.. సెట్స్‌ పైకి వెళ్ళిన కొన్ని రోజుల షూటింగ్‌కి ఆ బడ్జెట్ కాస్త రూ.175 కోట్లకు వెళ్లిందని.. ఇప్పటివరకు మూడు స్కెడ్యూల్స్ మాత్రమే పూర్తికాగా మిగిలిన షూటింగ్ పూర్తి అవ్వడానికి బడ్జెట్ మరింతగా పెరిగి దాదాపు రూ.200 కోట్ల వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్లు డైలమాల పడ్డారని.. వెనకడుగు త‌ప్ప‌దంటూ టాక్‌ నడుస్తుంది. బాలయ్య ఎన్ని బ్లాక్ బస్టర్లు కొట్టినా.. ప్రస్తుతం ఆయన మార్కెట్ రూ.100 కోట్ల షేర్ వరకే ఉంది. ఆయన సినిమాకు ఎంత మంచి టాక్ వచ్చిన.. రూ.85 కోట్ల షేర్ మాత్రమే దక్కింది.

Akhanda 2' update: Team to commence filming soon

అయితే.. అఖండ బ్రాండ్‌తో అఖండ 2 సినిమాకి రూ.150 కోట్ల వరకు షేర్ రావచ్చు అని అంచనాలు వేసుకున్నారు. అంతకుమించి రూ.200 కోట్ల షేర్లు రావటం అంటే అది చాలా కష్టతరం. పాన్ ఇండియన్ స్టార్ గా రాణిస్తున్న ఎన్టీఆర్ దేవర సినిమాకి రూ.200 కోట్ల షేర్ రాబట్టడం చాలా కష్టమైంది. ఇలాంటి క్ర‌మంలో.. సీనియర్ హీరో కేటగిరీలో ఉన్న బాలయ్య.. అంతటి షేర్ రాబట్టగలడా అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఈ క్రమంలోనే నిర్మాతలు వెనుకడుగు వేస్తారా.. లేదంటే బడ్జెట్లో ఎక్కడ తగ్గకుండా ప్రతిష్టాత్మకంగా సినిమాను పూర్తి చేస్తారా వేచి చూడాలి.