టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగు సినిమాలకు ప్రస్తుతం జపాన్‌లో ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. కథను బట్టి అక్కడ తారక్ సినిమాలు బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నాయి. ఈ నేపద్యంలో తాజాగా తారక్ దేవర.. జపనీస్ భాషలో డబ్బింగ్ చేసి రిలీజ్‌కు సిద్ధం చేశారు. మార్చి 28న ఈ సినిమా జపాన్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ పూర్తి చేసుకుని పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా.. ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే. దేవర ప్రచార కార్యక్రమాల కోసం జపాన్ వెళ్లిన ఆయన.. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్‌ను షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిస్తున్నాడు.
ఇక్కడ విషయం ఏంటంటే.. తారక్‌తో పాటు తోడుగా చరణ్ దేవినేని కూడా వెళ్లారు. ఇక నేడు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు కావడంతో.. తన భార్యను కూడా అక్కడికి తీసుకు వెళ్లిన తారక్.. జపాన్‌లో బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చెశారు. ఇదే రోజు చరణ్ దేవినేని బర్త్డే కూడా కావడంతో.. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా భార్యకు బర్త్ డే విషెస్ చెప్పిన ఎన్టీఆర్.. అదే స్టోరీలో చరణ్ దేవినేనితో జపాన్‌లో దిగిన ఫోటోలను పంచుకుంటూ హ్యాపీ బర్త్డే తమ్ముడు.. మై ఎవ్రీడే లక్ష్మణ అంటూ చెప్పుకొచ్చాడు.
దీంతో.. అసలు ఇంతకీ ఈ లక్ష్మణుడు ఎవరు.. ఈ చరణ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి.. అని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. కాగా ఈ చరణ్ హైదరాబాద్‌లో పాపులర్ డయాగ్నటిక్ సెంటర్ మెడికల్ టెస్ట్ల స్పెషలిస్ట్ అని.. అంతేకాదు ఆ డయాగ్నటిక్ సెంటర్ ఓనర్ కూడా చరణ్ దేవినేని సమాచారం. ఇక ఈ చరణ్ ఎన్టీఆర్‌కు వీరాభిమానట. అంతకుమించి గౌరవం కూడా. అంతేకాదు.. ఎన్టీఆర్ సన్నిహితులలో చరణ్ తేజ ముఖ్యంగా ఉంటారని.. షూటింగ్స్ ఏవి లేకుండా తారక్ తరచూ కలిసే వ్యక్తుల్లో చరణ్ దేవినేని కూడా ఒకడంటూ తెలుస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్, ప్రణతి దంపతులతో పాటు.. చరణ్ దేవినేని కూడా జపాన్‌లో సందడి చేస్తున్నాడు అంటూ.. వారి మధ్య అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.