ఎన్టీఆర్‌, త్రివిక్రమ్ భారీ పౌరాణిక సినిమా.. ఆ బ్యాన‌ర్‌లోనే..

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ట్ డైరెక్టర్‌లుగా ఉన్న మోస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్నారు. కానీ.. ఎప్పుడో వ‌ర‌ల్డ్ క్లాస్ థాట్స్ తో సినిమాలు తీసి అంద‌రిని ఆక‌ట్టుకున్న త్రివిక్ర‌మ్ ఇప్పటికీ టాలీవుడ్‌కే పరిమితమయ్యారు. ఇది అభిమానులకు నిరశ కలిగిస్తుంది. కాగా.. త్రివిక్రమ్, రాజమౌళి, సుకుమార్ ముగ్గురు టాలీవుడ్ లో వేసుకున్న ముద్ర వేరే లెవెల్. ముగ్గురు సపరేట్ లీడ్‌తో తమ మార్క్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ ముగ్గురిలో రాజమౌళి, సుకుమార్ ఇప్పటికే పాన్ ఇండియన్ డైరెక్టర్లుగా సక్సెస్ అందుకున్నారు.

Naga Vamsi Hints Mythological Hero in Allu Arjun Trivikram Film

ఈ క్ర‌మంలోనే గురూజీ నుంచి ఆయన రేంజ్‌కు తగ్గ ఒక్క సరైనా సినిమా ఎప్పుడు పడుతుందా అంటూ ఎదురుచూస్తున్న వారికి.. త్రివిక్రమ్ సమాధానం అంచనాలకు అందుకోలేని రేంజ్‌లో ఉంటుందంటూ ఆయన ఆస్థాన ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ వెల్లడించాడు. ఇక ఇప్పటికే నాగ వంశీ, త్రివిక్ర‌మ్‌ కాంబోలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు ఇద్దరితోను సినిమాలు చేయాల్సి ఉంది. కాగా ఇద్దరి నుంచి ఏ ఒక్క సినిమా ముందు వచ్చిన మొత్తం ఇండియన్ సినిమా మాట్లాడుకునే రేంజ్ లో ఆ సినిమా ఉంటుందంటూ చెప్తున్నారు. ఇక ఇతిహాస గాథల ద్వారా తెరకెక్కుతున్న సినిమాలు తక్కువ ఉన్నాయి అనే ప్రశ్నకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్న సినిమా సరైన సమాధానం అని.. అటు రామాయణం, మహాభారతాలతో సంబంధం లేకుండా ఇప్పటివరకు రాని కొత్త కాన్సెప్ట్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారంటూ వివరించారు.

Allu Arjun & Trivikram Srinivas' New Movie Announced! Will It Be A  Hat-Trick Hit?

ఇండియన్ సినిమా దగ్గర ఎవరికీ తెలియని కొత్త పాత్ర హీరోగా మన పురాణాల నుంచి తీసుకొని పరిచయం చేయనున్నట్లు వెల్లడించాడు. దీనిబట్టి త్రివిక్రమ్ ఆల్ ఇండియన్ గేంలోకి లేట్ ఎంట్రీ ఇచ్చిన.. ఎంట్రీ మాత్రం బాక్సాఫీస్‌ బ్లాస్ట్ రిసల్ట్ అందుకోవడం ఖాయం అంటూ చెబుతున్నారు. ఇక‌ త్రివిక్రమ్‌కి మహాభారత, రామాయణాల‌పై మంచి పట్టు ఉంది. అంత గ్రిప్ ఉన్న త్రివిక్రమ్ మంచి క్లారిటీతో సినిమా చేస్తే దాన్ని ఇంపాక్ట్ కచ్చితంగా వేరే లెవెల్ లో ఉంటుంది అనడంలో అతిశ‌యోక్తి లేదు. ఈ క్రమంలోనే ఆయన నుంచి సినిమా ఎప్పుడు వస్తుందో.. ఏ హీరోతో వస్తుందో.. ఇప్పటికీ సస్పెన్సే. దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.