రాబిన్‌హుడ్, మ్యాడ్ 2.. హవ్వ ఎంత సిగ్గుచేటు..

ఈ వీకెండ్ కు రాబిన్‌హుడ్ , మ్యాడ్ 2 రెండు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పటికే ఈ రెండు సినిమాలకు ఆడియన్స్‌లో విపరీతమైన బజ్ నెలకొంది. ఈ క్ర‌మంలో సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం ప్రస్తుతం హాట్‌ టాపిక్ గా మారింది. కల్కి, సలార్‌, గేమ్ ఛేంజ‌ర్‌ రేట్లు పెంచారు అంటే.. బడ్జెట్ చాలా ఎక్కువ అని పెంచారు అనుకోవచ్చు. కానీ.. అతి తక్కువ బడ్జెట్ తో.. కాస్టింగ్ మార్కెట్‌కు తగ్గ రేంజ్‌లో తెర‌కెక్కిన సినిమాలకు కూడా టికెట్ల రేట్లు పెంచడం ఏంటి.. ఎక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలంటే రికవరీ అయ్యేందుకు ప్రోత్సాహం కోసం ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచామంటూ చెప్పుకొచ్చాయి.

మరి రాబిన్‌హుడ్, మ్యాడ్ 2 సినిమాలకు ఎందుకు టికెట్ రేట్లు పెంచారు.. అనే సందేహం ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. కేవలం బడ్జెట్ తోనే సంబంధం లేకుండా హైప్ బేస్ చేసుకుని కూడా టికెట్లు రేట్లు పెంచుకునే వెసులుబాటు గవర్నమెంట్ ఇచ్చేసిందేమో.. ఈ రెండు సినిమాలపై ప్రస్తుతం మంచి హైప్ నెలకొన్న క్రమంలో.. దానిని క్యాష్ చేసుకునేలా టికెట్లు రేట్లు పెంచేసి ఉంటారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది కేవలం టికెట్ రేట్లు రూ.75 ఏ కదా పెంచారు.. దీనికి ఎందుకు ఇంత రచ్చ అని అడిగే వారు ఉన్నారు.

Robinhood (2025 film) - Wikipedia

కానీ.. ఇక్కడ సమస్య టికెట్ రేట్లు ఎంత పెంచారు అన్నది కాదు.. అసలు రేట్లు పెంచడం ఎందుకు. మ్యాడ్ 2చిన్న సినిమా అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక రాబిన్‌హుడ్.. నితిన్ మార్కెట్ కు తగ్గట్టుగా బడ్జెట్ ప్లాన్ చేసిన‌.. మధ్యలో ఇంకాస్త ఎక్కువ ఖర్చయింది. అంతేకానీ.. ఇది కూడా ఓ భారీ బడ్జెట్ సినిమా కాదు. ఇక ఈ రెండు సినిమాలుకు భారి గ్రాఫిక్స్ లు ఉపయోగించలేదు. అయినా ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు సినిమాల టికెట్ రేట్లు పెంచడం హాట్ టాపిక్ గా మారింది. బహుశా ప్రభుత్వ పెద్దలతో సినిమా మేక‌ర్స్‌కు స‌త్‌సంబంధాలు ఉంటే చాలేమో.. ఆ సినిమా చిన్నదైనా, పెద్దదైన రేట్లు పెంచుకోవచ్చేమో అంటూ.. ఈ వీకెండ్ రిలీజ్ కు రెడీ అయిన రెండు సినిమాలపై నెటిజన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.