యంగ్ హీరో సిద్ద జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో ఏ హీరో అయినా ఓ ముద్ర పడిపోయింది అంటే అది తర్వాత చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. హిట్లు వచ్చినంత కాలం పర్లేదు.. కాస్త అటు, ఇటు అయిందంటే హీరోల కెరీర్ ప్రమాదంలో పడిపోతుంది. ఇక ప్రస్తుతం హీరో సిద్దు జొన్నలగడ్డ విషయంలో ఇదే టాక్ నడుస్తుంది. సిద్దుకు దర్శకులతో ఎప్పుడు క్రియేటివ్ డిఫరెన్స్ అనే మాట వినిపిస్తూ వస్తుంది. డిజే టిల్లు టైంలో.. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన టిల్లు స్క్వేర్ కు మల్లిక్ రామ్ డైరెక్టర్ గా వ్యవహరించాడు.
అయితే టిల్లు స్క్వేర్ షూట్ టైంలో.. పేరుకు మల్లిక్ రామ్ డైరెక్టర్.. కానీ పెత్తనం అంతా సిద్దు చేసాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సిద్దూ రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెంచేశాడు. ఒక్క సినిమాకి రూ.15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. క్రేజ్‌ను బట్టి రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం తప్పు కాదు. అలా ఒప్పుకున్న రెండు సినిమాలు జాక్ , తెలుసుకదా.. ఇప్పటికీ సట్స్ పైనే నడుస్తూన్నాయి. కాగా ఈ రెండు సినిమాల్లో తెలుసుకదా సినిమాకు కొత్త డైరెక్టర్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోని సిద్ధు దగ్గరుండి స్క్రిప్ట్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని.. అందుకే ఈ సినిమా విషయంలో లేటవుతుందని టాక్.
ఇక జాక్ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. మరో రెండు వారాల్లో సినిమా రిలీజ్ కానున్న ఇంకా షూట్ పూర్తి కాలేదు. ఓ పాట కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇలాంటి క్రమంలో డైరెక్టర్ భాస్కర్ తో సిద్దుకి పడటం లేదట. తను అనుకున్నట్లు సినిమా తీస్తానని దర్శకుడు వాదిస్తుంటే.. అలా కాదు ఇలా చేయాలంటూ సిద్దు ఫ్రీ సజెషన్స్ ఇస్తున్నాడని టాక్. దీంతో వీళ్ళిద్దరూ ఎడమోకం, పెడముఖంగా ఉంటున్నారట.
సిద్దు డైరెక్టర్ చెప్పినట్లు కాకుండా తనకు నచ్చినట్లైతే సినిమా చేస్తానని చెప్పడం.. ఒక్కసారి దర్శకులతో క్రియేటివ్ డిఫరెన్స్ వస్తే సిద్దు తప్పు కాదేమో అనుకోవచ్చు. కానీ.. ప్రతిసారి సిద్ధూ తో పనిచేస్తున్న ప్రతి దర్శకుడు తోనూ ఇదే మాట వినిపిస్తే.. అసలు సిద్దుకి ఎవరితోనో సరిపడేదేమో అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాల మార్కెట్ డౌన్ అయితే మాత్రం.. రాబోయే ఆ సినిమాలకు కూడా ఇబ్బంది వస్తుంది. కనుక సిద్దు డైరెక్టర్ విషయంలో ఆలోచించి అడుగులు వేయాలని.. లేదంటే తిప్పలు తప్పవు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.