ఈ వీక్ లో బాక్సాఫీస్ వార్‌కు 4 సినిమాలు సిద్ధమవుతున్నాయి. వాటిలో 2 స్ట్రైట్ తెలుగు సినిమాలు. రెండు డబ్బింగ్ మూవీప్. వేరే లాంగ్వేజ్ సినిమాలతో అసలు సమస్య ఉండదు. ఇక మిగిలిన రెండు తెలుగు సినిమాలే వాటితో అవే తాము పోటీకి సై అంటున్నాయి. అవే రాబిన్‌హుడ్, మ్యాడ్ 2. ఇక ఇది ఓ లాంగ్ వీకెండ్ కావడం.. ఆదివారం, సోమవారం రంజాన్ సెలవు కలిసి రావడంతో ఈ వీకెండ్ మూవీస్ రిలీజ్‌కు క్యూ కట్టాయి. వాస్తవానికి రాబిన్‌హుడ్ మిడ్ బడ్జెట్ మూవీ. ఇక దాంతో పోలిస్తే మ్యాడ్ 2 చిన్న సినిమా. ఇక ఈ రెండు సినిమాలకు బాక్సాఫీసు దగ్గర సరిపోయే అన్ని థియేటర్లు కూడా ఉన్నాయి. అయినా రెండు సినిమాల నిర్మాతల మధ్య మాత్రం పోటీ నెలకొంది.
ఇక మొదటి నుంచి మైత్రీ మూవీస్, సితార ఎంటర్టైన్మెంట్స్ మధ్య మంచి స్నేహం వుంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ విషయంపై ఇద్దరూ కూర్చొని మాట్లాడుకున్నారని.. ఓ సినిమా వాయిదా పడితే బాగుంటుందని అనుకున్నట్లు సమాచారం. కానీ.. అది కుదరలేదు. కనీసం ఒక్కరోజు గ్యాప్ వచ్చి ఉన్న రెండు సినిమాల విషయంలో ఎలాంటి పోటీ ఉండేది కాదు. కానీ.. అది వీలుపడలేదు. మాడ్ సినిమా మార్చి 29న రిలీజ్ చేద్దాం అనుకున్నా.. అదే రోజు అమావాస్య రావడంతో.. సెంటిమెంట్ వర్కౌట్ కాదని 28 కి తీసుకొచ్చారు. అటు మైత్రి మేకర్స్ కానీ, ఇటు నాగవంశీ కానీ మరో సినిమా పోటీకి రావడం ఇబ్బందికరమే అనుకున్నారు.
ఇలాంటి క్రమంలో సోలో రిలీజ్ దక్కకపోవడం.. రాబిన్ హుడ్కు నైజంలో థియేటర్లు సరిగ్గా పడకపోవడం మరింత ఇబ్బందిగా మారింది. కారణం నైజాం థియేటర్లన్నీ దిల్ రాజు చేతిలో ఉండటం. ఆయన లూసిఫర్ 2 సినిమాను రిలీజ్ చేస్తున్న క్రమంలో.. అక్కడ వీలైనంత థియేటర్లు లూసిఫర్ కి వెళ్తాయి. ఈ క్రమంలోనే ప్రతి థియేటర్లోనూ మ్యాడ్ లేదా రాబిన్‌హుడ్ సినిమాలు ఉండాలన్న లెక్కలేదు. దీనికి ఐపిఎల్ సీజన్ తోడవటం మరికాస్త మైనస్ అయ్యింది. అలాంటి క్రమంలో ఒక సినిమాకు మరో సినిమా కాంపిటీషన్ గా దిగితే మరింత టఫ్ కాంపిటీషన్ నెలకొంటుంది. ఈ క్రమంలోనే మైత్రి, సితార ఇద్దరు శతమతమవుతున్నారని టాక్.