బర్త్డే స్పెషల్: చరణ్ లైఫ్ స్టైల్.. ఆస్తుల లెక్కలు ఇవే..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్లో అభిమానాన్ని సంపాదించుకున్న చరణ్.. నేడు తన 41వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేప‌ద్యంలో ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక విషెస్ వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్.. తండ్రికి మించిన తనయుడుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే చరణ్ పుట్టినరోజు స్పెషల్‌గా చరణ్ లైఫ్ స్టైల్, అయనా ఆస్తుల విలువలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Viral Pic: Upasana Konidela shares first family photo featuring Ram Charan  and daughter. Seen yet?

మెగా కోట యువరాజు చరణ్.. ప్రస్తుత నికర ఆస్తుల విలువ రూ.1370 కోట్లని తెలుస్తుంది. ఇక హైదరాబాదులో ఆయన హౌస్ ఏకంగా30 కోట్ల విలువ చేస్తుంద‌ట‌. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ విలాసవంతమైన బంగ్లా ఆయన సొంతం. దీని ధర దాదాపు రూ.35 నుంచి రూ.38 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక ఈ బంగ్లా 25 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉంది. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ పార్టీ అయినా ఎక్కువగా ఇక్కడే జరుపుకుంటారు. ఇక ఇంటి ఇంటీరియర్ కోసమే విదేశాల నుంచి ఎన్నో వస్తువులను చరన్ దిగుమతి చేసుకున్నారట. ఇక ఈ బంగ్లాలో స్విమ్మింగ్ పూల్, పర్సనల్ జిమ్, టెర్రస్ గార్డెన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి.

హీరోగా ప్రస్తుతం బిజీగా గడుపుతున్న చరణ్.. తన ఫిట్నెస్ అంతా ఇంట్లో ఉండే చూసుకుంటాడు. ఇక చరణ్.. భార్య ఉపాసనతో కలిసి ప్రతి పండుగను గ్రాండ్గా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాదు చరణ్ ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష చేపట్టి ఎంతో నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇంట్లోనే పెద్ద గుడి కట్టించుకున్నాడు చరణ్. ప్రతి ఉదయం, సాయంత్రం ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారట. ఇక ఆయన ఇంటి నుంచి సూర్యోదయం వ్యూ చాలా అద్భుతంగా కనిపించేలా హౌస్ డిజైన్ చేయించుకున్నాడు.

ఇక లగ్జరీ కార్లు చరణ్ గోడౌన్ లో ఎన్నో ఉన్నాయట‌. ఇక‌ చరణ్ సినిమాలతో పాటు.. పలు యాడ్ ప్రమోషన్స్, అలాగే బిజినెస్లలో రాణిస్తూ అంతకంతకు ఆస్తులను పెంచుకుంటూ పోతున్నాడు. ఆయన భార్య ఉపాసన కూడా సంపన్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆర్సీ 16 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాపై ఇప్పటికి ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాల నెల‌కొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమా, ప్రశాంత్ నీల్‌తో ఇంకో సినిమా చ‌ర‌ణ్ చేయనున్నాడు.