టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ నటించిన తాజా మూవీ రాబిన్‌హుడ్ త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. మైత్రి మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ తాజాగా జోరందుకున్నాయి. ఇందులో భాగంగానే సినిమా ప్రమోషన్స్ లో విలేకరుల ప్రెస్ మీట్లో పాల్గొన్నారు నిర్మాత రవిశంకర్. ఇందులో భాగంగానే.. ఆయన ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. తాము నిర్మిస్తున్న పలు భారీ బడ్జెట్ సినిమాలు 2026 లో రిలీజ్ కానున్నాయని.. 2026 మాకు ఎంతో ప్రత్యేకంగా ఉండనుందంటూ చెప్పుకొచ్చాడు.
పుష్ప 2 విషయంలో ప్రసాద్ మల్టీప్లెక్స్ విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన స్పందించి.. పాలసీ విషయంలో అప్పుడప్పుడు చిన్న సమస్యలు ఎదురవుతాయని.. అది సీరియస్ మ్యాటర్ కాదంటూ చెప్పుకోచాడు. రాబిన్‌హుడ్‌ను ప్రసాద్ ఐమాక్స్‌లోనే రిలీజ్ చేస్తున్నామని వివరించారు. ఈ మూవీ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రీమియర్ షో లపై ఆయన రియాక్ట్ అవుతూ.. పుష్ప 2 ప్రీమియర్ షో ఘటనను ఉద్దేశిస్తూ మాకు ప్రీమియర్ షోలు అసలు అచ్చు రాలేదు. అందుకే రాబిన్ హుడ్ విషయంలో ఆ ఆలోచనలు చేయలేదంటూ వివరించాడు.
రామ్ చరణ్, బుచ్చిబాబు సన్నా కాంబినేషన్ గురించి మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆర్ సి 16 సినిమాపై ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సినిమా గ్లింప్స్ చూసానని.. ఎంతగానో ఆకట్టుకుందంటూ వివరించాడు. ప్రత్యేకంగా రూపొందించిన ఆ ఒక్క సీన్ కోసమే గ్లింప్స్ ఆడియన్స్ వెయ్యి సార్లు చూస్తారు అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రవిశంకర్ కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఇక నేడు చరణ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా తాజాగా RC 16అఫీషియల్ టైటిల్ పెద్ది గా ప్రకటించారు మేకర్స్.