రాజమౌళి సినీ కెరీర్ లో జీర్ణించుకోలేకపోయినా ఏకైక బాధ అదే..!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇంత పెద్ద టాప్ డైరెక్టర్గా ఎదిగిన‌ ఆయన.. 24 ఏళ్ల సినీ కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా రాణిస్తున్నా.. ఒకే ఒక బాధాకర సంఘటన మాత్రం ఎప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడట. ఆ సంఘటన గురించి ఇటీవల ఇంటర్వ్యూలో స్వయంగా జక్కన్న వివరించాడు. కెరీర్ బిగినింగ్‌లో ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయిన కష్టాలు ఎదుర్కోక తప్పదు.. కానీ రాజమౌళి టాప్ డైరెక్టర్గా ఎదిగిన తరువాతే జరిగిన ఓ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాడట.

SS Rajamouli says they spent zero money on 'Baahubali' promotions: 'Used  our brains'

ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు జక్కన్న. మీ కెరీర్‌లో అత్యంత బాధాకరమైన సంఘటన, లోయస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా అని ప్రశ్నకు రియాక్ట్ అయ్యారు. జక్కన్న స్టూడెంట్ నెంబర్ 1తో టాలీవుడ్‌కు పరిచయమై.. తర్వాత సింహాద్రి,యమదొంగ, ఈగ, మగధీర ఇలా వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పెద్ద రిస్క్ చేశాడు. ప్రభాస్‌తో బాహుబలి రెండు భాగాలుగా తెర‌కెక్కించాడు. అప్పటివరకు టాలీవుడ్ కలలో కూడా ఊహించని భారీ బడ్జెట్‌ సినిమాను రూపొందించి సంచలనాలు క్రియేట్ చేశాడు. అయితే ఈ సినిమా రిలీజ్ టైం లో ప్రభాస్ అంటే టాలీవుడ్‌కే కానీ.. అసలు అతను ఎవరో ఇండియా స్థాయిలో చాలామందికి తెలియనే తెలియదు.

అలాంటి క్ర‌మంలో హీరోగా ప్రభాస్‌ను పెట్టి అత్యంత భారీ బడ్జెట్ తో సినిమా తీసి రిస్క్ చేశాడు. అయినా ఎక్కడ తడబడకుండా సక్సెస్ఫుల్గా షూటింగ్ పూర్తి చేసి మంచి బ‌జ్ క్రియేట్ చేసి బాహుబలి వన్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజై ప్రపంచవ్యాప్తంగా సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఒక్క తెలుగులో తప్ప. ఇక సినిమా దెబ్బ పడడానికి అదొక్క కారణం చాలు. బడ్జెట్లో మేజర్ పార్ట్ రికవరీ కావాలంటే బాహుబలి 1 తెలుగులోనే సూపర్ హిట్ కావాలి. కానీ.. మొదటి షో నుంచే తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 1 నెగటివ్ టాక్‌ వచ్చింది.

Baahubali 2: The Conclusion - Wikipedia

నిర్మాత శోభు యార్లగడ్డ కేవలం తనని నమ్ముకుని అంత బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు బాహుబలి ఫ్లాప్ అయితే బాహుబలి 2 రిలీజ్ ఉంటుందో.. లేదో.. అనే టెన్షన్ రాజమౌళిలో నెలకొందట. పెట్టిన డబ్బు మొత్తం వృధా. అంతా కొలెప్స్ అయిపోయింది అన్న ఫీల్ రాజమౌళికి వచ్చిందని వివరించారు. ఫస్ట్ డే మొత్తం అలాంటి టాక్ ఏ వచ్చింది.. ఏం చేయాలి.. శోభుని ఎలా ఎదుర్కోవాలి.. అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదని రాజమౌళి స్వయంగా వివరించారు. సెకండ్ డే మొదలైన పాజిటివ్ టాక్ అలాగే స్టడీగా కొనసాగడంతో.. కాస్త రిలాక్స్ అయ్యాడట. ఇప్పటికీ ఆ సంఘటన మాత్రం మర్చిపోలేను అంటూ రాజమౌళి వివరించారు.