టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక వీటిలో మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో హరీష్ శంకర్ డైరెక్షన్‌లో సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. ఇక ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. పవన్ ఇచ్చే అతి కొద్ది రోజుల వ్యవధిలోనే సాలిడ్ కంటెంట్ సినిమాను తెరకెక్కించి అందరిని సర్ప్రైజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడట హరిష్ శంకర్. దీంతో ఈ సినిమా పేరు కూడా ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న నిర్మాత రవిశంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
పవన్ కళ్యాణ్ గారికి ముందు పాన్ ఇండియన్ స్టార్ హీరోలు, బిగ్ బడ్జెట్ సినిమాలు కూడా బలాదూర్ అన్నట్లుగా ఆయన కామెంట్లు చేశాడు. నితిన్ రాబిన్‌హుడ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్‌గా మారుతున్నాయి. పవన్ డేట్స్ కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ చెప్పుకొచ్చిన రవిశంకర్.. వచ్చే ఏడాది ఎలాగైనా సినిమా రిలీజ్ చేస్తామని.. ఆడియన్స్ ఊహించిన దాని కంటే ఎక్కువ కిక్ ఇస్తామంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం రవిశంకర్ చేసిన ఈ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తి నెలకొల్పింది.
ప్రస్తుతం పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తూనే హరిహర వీరమల్లు, ఓజి సినిమా షూట్లకు సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు పూర్తి అయితే గాని ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే సినిమాపై ఆశలు వదులుకుంటున్నారు అభిమానులు. ఇలాంటి క్రమంలో నిర్మాత రవిశంకర్ చేసిన కామెంట్స్ అభిమానులలో కొత్త జోష్ తీసుకువచ్చాయి. రవిశంకర్ చెప్పిన రేంజ్ లో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ కంటెంట్ షూట్లు పూర్తిచేసుకుని.. రిలీజ్ అయితే మాత్రం కచ్చితంగా బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రవిశంకర్ హామీ ఇచ్చినట్లు పవన్ సినిమా కోసం సరిపడా డేట్స్ ను ఇస్తారా.. లేదా ఈ సినిమాను మధ్యలోనే ఆపేస్తారా వేచి చూడాలి.