టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరు వారసుడిగా ఇండస్ట్రకీలో అడుగుపెట్టి తన నటనతో విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చెర్రీ.. చివరిగా శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ సినిమా నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో పెద్ది సినిమా నటిస్తున్నాడు.
ఇక ఆర్సి 16 రన్నింగ్ టైటిల్ తో రూపొందిన ఈ సినిమాకు.. నేడు చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. పెద్ది అఫీషియల్ టైటిల్, చరణ్ కొత్త లుక్ ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే పోస్టర్ పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ.. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా మెరుస్తోంది. చరణ్ త్వరలోనే ఈ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఇలాంటి క్రమంలో చరణ్‌ను ఓ స్టార్ హీరోయిన్ పీకల్లోతుగా ప్రేమించిందని.. అతనితో పెళ్లి కూడా చేసుకోవాలనుకుందంటూ టాక్ వైరల్ గా మారుతుంది.
ఇక ప్రస్తుతం చరణ్.. ఉపాసనను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులు క్రితమే వీరికి క్లింకార కూడా జన్మించింది. ఇక పెళ్లికి ముందు చరణ్‌తో పాటు కలిసి నటించిన ఓ స్టార్‌బ్యూటీ.. అతన్ని వివాహం చేసుకోవాలనుకుందట. ఇంటికి ఆమె ఎవరో కాదు కాజల్ అగర్వాల్. చరణ్‌తో కలిసి నటిస్తున్న మగధీర షూట్ టైంలోనే చరణ్‌ను ప్రేమించిన ఈ అమ్మడు.. చరణ్‌ని పెళ్లి కూడా చేసుకోవాలనుకుందట. కానీ.. చరణ్, ఉపాసనతో ప్రేమలో పడటంతో తను లవ్ లో డ్రాప్ అయిపోయిందని.. తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు గౌతం కిచ్లుకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. అతని ప్రేమించే వివాహం చేసుకుంది. ఇక ఈ జంటకు ఒక మగ బిడ్డ ఉన్నాడు. ఈ వార్తల్లో వాస్తవం ఉంటే తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.