టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి శోభిత ధూళిపాళ్లకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ బడా ఫ్యామిలీ అక్కినేని కుటుంబానికి కోడలుగా అడుగుపెట్టి ఒకసారిగా భారీ పాపులారిటి దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తనకు ఎవరైన ఓ చేదు అనుభవం గురించి శోభిత ధూళిపాళ్ల ఇంటర్వ్యూలో చెబుతూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
ఓ బ్రాండ్ వాళ్ళు రాత్రి 11:30 కు కాల్ చేసి ఆడిషన్స్ కోసం పిలిచారని.. నాకు కాస్త వింతగా అనిపించినా.. సరే అని వెళ్ళా. ఆడిషన్స్ పూర్తయ్యాయి. యాడ్ షూట్ కోసం గోవా వెళ్లాల్సి ఉంటుందని అన్నారని చెప్పుకొచ్చింది. గోవా అనగానే నేను చాలా ఎక్సైట్ అయ్యానని.. గోవా వెళ్లాక ఫస్ట్ డే షూట్ బాగానే పూర్తయింది. తర్వాత కెమెరాలో ఏదో సమస్య అని మిగతా షూట్ తర్వాత చేద్దామని ఆపేశారు అంటూ శోభిత వివరించింది. ఆ తర్వాత రోజు నేను సెట్స్‌కు వెళ్ళగా ఈ అమ్మాయి మన బ్రాండ్ ఇమేజ్కు సరిపోదు అంటూ కామెంట్లు వినిపించాయని.. నేను కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నానని నన్ను వద్దన్నారంటూ శోభిత చెప్పుకొచ్చింది.
నా ప్లేస్ లో ఓ కుక్కను పెట్టుకున్నారంటూ వివరించింది. ఒకరోజు వర్క్ చేసినందుకు నాకు డబ్బులు ఇచ్చేసారని శోభిత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు కెరీర్ పరంగా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు సినిమాలకు రెమ్యునరేషన్ పరిమితంగానే ఉండడంతో.. మరిన్ని అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే భర్త నాగచైతన్యతో కలిసి శోభిత ఓ సినిమాలో నటిస్తే చూడాలని ఉంది అంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూచర్లో ఈ జంట అభిమానుల కోరిక నెరవేరుస్తారో లేదో వేచి చూడాలి.