‘ టాక్ ఆఫ్ ది టౌన్‌ ‘గా రష్మిక రెక్కల కార్.. కాస్ట్ తెలిస్తే కళ్ళు జిగేల్ అనాల్సిందే..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మంచి సక్సెస్ రేట్ ఉన్న స్టార్ హీరోయిన్గా రష్మిక మందన దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌కు ఛ‌ల్లో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ‌.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ ను దక్కించుకుంది. కాగా రష్మిక కెరీర్ మలుపు తిరగడానికి ప్రధాన కారణం పుష్ప మూవీ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో పాన్ ఇండియా లెవెల్‌లో మంచి మార్కులు కొట్టేసింది. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాల్లో నటించి వరుస సక్సెస్‌లు అందుకుని.. బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ రేంజ్‌కు ఎదిగింది.

నేషనల్ క్ర‌ష్‌గా తిరుగులేని పాపులారిటీ దక్కించుకుంది. ఇక.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ జంటగా సికిందర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సినిమా ఈ నెల 30న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో సందడి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇలా.. సినీ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక మందన.. తాజాగా ఓ ఈవెంట్‌కు స్పెషల్ వింగ్స్.. బ్లాక్ లగ్జరీ కార్ లో దిగుతూ దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం ఈ రెక్కల కారు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఇక ఈ కార్ మెర్సీ డేస్ బెంజ్ s450 మోడల్ అని తెలుస్తుంది.

Rashmika Mandanna Buys Rs 2.10 Crore Mercedes S450

కాగా.. ప్రస్తుతం ఈ మోడల్ తో పాటు.. కార్ కాస్ట్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. చూడడానికి ఎంతో అందంగా, లగ్జ‌రిగా కనిపిస్తున్న ఈ కార్ కాస్ట్ చూస్తే ఖచ్చితంగా కళ్ళు జిగేలుమ‌నాల్సిందే. ఇక.. ఈ కారు విలువ అక్షరాల రెండు కోట్ల. ఇండస్ట్రీలో ఇలాంటి కార్లు చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే ఉన్నాయి. ఇక.. ప్రస్తుతం రష్మిక మందన సినిమాకు పది కోట్లకు పైగా రెమ్యూనరేషన్ చార్జ్‌ చేసే రేంజ్‌కు ఎదిగింది ర‌ష్మిక‌. ఈ క్రమంలోనే ఇలాంటి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం, లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం చాలా కామన్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.