టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. చివరిగా సలార్, కల్కిలతో సాలిడ్ సక్సెస్ లు అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆడియన్స్ను తన సినిమాలతో ఎలాగైనా ఆకట్టుకోవాలని కసితో మంచి కంటెంట్ ఎంచుకుంటున్న ప్రభాస్.. నెక్స్ట్ హనురాఘవపూడి డైరెక్షన్లో ఓ సినిమా నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్.. అగ్రహారం యువకుడిగా కనిపించనున్నాడని.. ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటివరకు చేయని, చూడని ఓ కొత్త తరహా పాత్రగా ఇది ఉండబోతుందని టాక్.
ఇప్పటివరకు యాక్షన్ సినిమాల హీరోగా పాన్ ఇండియన్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్‌ను.. హాను రాఘవపూడి సరికొత్త తరహాలో సాంప్రదాయపద్ధమైన అగ్రహారం యువకుడిగా చూపించనున్నాడట. ఈ పాత్ర కోసం ప్రభాస్ కొత్త బాడీ లాంగ్వేజ్‌ను నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే హనురాగపూడి.. అందాల రాక్షసి, పడి పడి లేచే మనసు, సీతారామం లాంటి సున్నితమైన కథాంశాలను ఎంచుకొని మంచి సక్సెస్‌లు అందుకున్నాడు. తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.
ఇప్పుడు ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ హీరోతో తెరకెక్కించనున్న సినిమాతో అయినా ఎలాంటి మ్యాజిక్ చేయనున్నాడో అనే ఆసక్తి ఆడియన్స్ అందరిలోనూ నెలకొంది. ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా రూపొందనుందని.. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ డెలివరీ మొత్తం పూర్తిగా చేంజ్ చేయనున్నాడని.. ఇది కచ్చితంగా ఫ్యాన్స్‌లో సర్ప్రైజింగ్ ప్యాకేజీగా ఉంటుందని.. అభిమానులు ఆయన క్యారెక్టర్జేషన్ కు ఫిదా అవ్వాల్సిందే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తల వాస్తవ్యంతో తెలియదు గానీ.. అగ్రహారం యువకుడిగా డార్లింగ్ కనిపిస్తే మాత్రం కచ్చితంగా ఆడియన్స్‌లో విపరీతమైన బజ్ నెలకొంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.