ఇండస్ట్రీలో మొదట ఓ హీరో కోసం అనుకున్న కథను ఆ హీరో రిజెక్ట్ చేయడం లేదా ఇంకేవో కారణాలతో మరొక హీరో ఆ కథలో నటించడం లాంటివి చాలా కామన్. అయితే వాళ్ళు రిజెక్ట్ చేసిన కథతో నటించిన మరో హీరో బ్లాక్ బస్టర్ కొడితే.. రిజెక్ట్ చేసిన హీరోస్ అనవసరంగా సినిమాను మిస్ చేసుకున్నట్లు అవుతుంది. అలా.. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఒక కథను రిజెక్ట్ చేశారని.. అదే కథలో మాస్ మహారాజు రవితేజ నటించి బ్లాక్ బస్టర్ కొట్టాడు అంటూ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఇంతకీ బన్నీ, తారక్ రిజెక్ట్ చేసిన ఆ స్టోరీ ఏంటో.. కారణాలేంటో ఒకసారి తెలుసుకుందాం.
గతంలో మాస్ మహారాజ్ హీరోగా.. మీరాజాస్మిన్ హీరొయిన్‌గా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో భద్ర సినిమా తెరకెక్కి ఎలాంటి బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకుందో తెలిసిందే. పవర్ఫుల్ యాక్షన్, లవ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆడియన్స్‌కు తగ్గట్టుగానే సూపర్ డూపర్ సాలిడ్ సక్సెస్ అందుకుంది. ఇక సినిమాలో మొదట బోయపాటి.. రవితేజను కాకుండా బన్నీని హీరోగా భావించాడట.
అందులో భాగంగానే ఆయనను కలిసి.. కథ కూడా వినిపించాడట. కానీ.. అప్పట్లో బన్నీ ఆర్య సినిమా షూట్లో బిజీగా ఉండడంతో.. కథ బాగా నచ్చిన ఆర్య సినిమా పూర్తి సినిమా సెట్స్‌పైకి రావడానికి చాలా ఆలస్యం అయిపోతుంది. మీరు వేరే హీరోతో మొదలు పెట్టేయండి అని వివరించాడట. దీంతో బోయపాటి చేసేదేమీ లేక తారక్ వద్దకు ఈ కథను తీసుకువెళ్లాడు. అయితే కథ మొత్తం విన్న తారక్.. స్టోరీ పెద్దగా నచ్చలేదని ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. దీంతో బోయపాటి శ్రీను.. రవితేజకు కథను వినిపించడం, ఆయన స్టోరీ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెంటనే ఈ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకుంది.