” మ్యాడ్ స్క్వేర్ ” ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఇదే..!

2023లో చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా మ్యాడ్‌ స్క్వేర్ రూపొందిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో నార్నీ నితిన్. సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. ఇక కొద్ది గంటల క్రితం ఎర్లీ మార్నింగ్ షో ముగించుకుంది. ఇక‌ మూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ రివ్యూలను అందించారు. ఇక పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

మ్యాడ్ స్క్వేర్‌ ఫస్ట్ హాఫ్ బాగా ఎంటర్టైన్ చేసిందని.. కొన్ని వన్ లైనర్స్ అయితే హెలోరియస్‌గా అనిపించాయంటు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. లడ్డు ఫాదర్ పాత్రలో మురళీధర్ గౌడ్ వన్ మ్యాన్ షో చేశాడ‌ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మ్యారేజ్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుందని.. సినిమాలోని స్పెషల్ సాంగ్ తో సహా అన్ని సాంగ్స్ బాగున్నాయంటూ లడ్డు సినిమాల్లో తన నటనతో వన్ మ్యాన్ షో చేసాడని.. ఆకట్టుకున్నాడు అంటూ ఓ నెటిజ‌న్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇంకొకరు ప్ర‌తి సన్నివేశంలోనూ కామెడీ జోడించిన తీరు డైరెక్టర్ మార్క్ చూపించిందని.. 30 నిమిషాల పాటు సాగే మ్యారేజ్ ఎపిసోడ్ కంటిన్యూస్గా నవ్విస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఎపిసోడ్ కోసమే సినిమాలు చూడొచ్చు. లడ్డుతోపాటు సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రలో అదరగొట్టారని రివ్యూ ఇచ్చారు.

ఇక మరొకరు,, ఫస్ట్ ఆఫ్ బాగుంది ఫన్ ఓకే. కానీ.. క్యారెక్టర్లలో సోల్ కనిపించలేదు. కొన్ని సీన్లు బలవంతంగా చేసినట్లు అనిపించినా.. మ్యాడ్ కంటే మ్యాడ్ స్క్వేర్ బాగుందంటూ రాసుకొచ్చారు.ఇలా దాదాపు సినిమా చూసిన ఆడియోస్ అంతా ఫస్ట్ హాఫ్ బాగుందని.. సెకండ్ హాఫ్ యావరేజ్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల బలవంతంగా కామెడీ పండించాలని ప్రయత్నించారంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక లడ్డు సినిమాల్లో తన నటనతో వన్ మ్యాన్ షో చేసాడని.. ఆకట్టుకున్నాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఓ క్రిటిక్‌ ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. సినిమాకు ఇండియాలో, ఓవర్సీస్ లో మంచి క్రేజ్‌ ఉంది. మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. పరిస్థితి చూస్తే యావరేజ్ టాక్ వచ్చిన హిట్ కొట్టేలా సినిమా ఉంది. ఒకవేళ సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం.. బాక్స్ ఆఫీస్ లో చింపేయడం ఖాయం అంటూ వెల్లడించారు.