రాబిన్ హుడ్ ట్విట్టర్ రివ్యూ: నితిన్ ఇప్పుడైనా హిట్ కొట్టాడా..? తుస్సు మనిపించాడా..?

యంగ్ హీరో నితిన్, హీరోయిన్ శ్రీ‌లీలా జంటగా నటించిన తాజా మూవీ రాబిన్‌హుడ్. క్రికెట్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పింది. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యార్నేని నవీన్, రవి శంకర్ నిర్మాతలుగా వివరించిన ఈ సినిమా కొద్ది గంటల క్రితం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్ ప్రదర్శన తర్వాత సినిమా చూసిన ఆడియ‌న్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇంతకీ ఆడియన్స్ సినిమా ఎలా మెప్పించిందో ఒకసారి చూద్దాం.

రాబిన్‌హుడ్ ఫన్ ఎంట‌ర్టైనర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని.. యావరేజ్‌ సినిమా కంటే ఎక్కువగానే మెప్పిస్తుందని.. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఓకే అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కథ కొత్తగా ఏమీ లేకపోయినా.. కామెడీ వైస్ సీన్లతో ఓ ఫ్లోలో ఆకట్టుకుందని.. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని.. డేవిడ్ వార్నర్ విలన్ గా కనిపించనున్నారని లీడ్ ఇచ్చారంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

మరో నెటిజన్ 12 ఫ్లాప్ లనే తట్టుకొని బలంగా నిలబడిన నితిన్.. తిరిగి స్ట్రాంగ్ హిట్ కొట్టాడు. ఇప్పుడు మళ్లీ ఆ టైం వచ్చింది. ఐదేళ్ల నుంచి నితిన్ కు హీట్ లేదు. ఇప్పుడు రాబిన్‌హుడ్ తో మరోసారి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడు. ఇది ఆయనకు చాలా స్పెషల్ అంటూ ఓ నెటిజ‌న్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

మరొకరు సమ్మర్లో మంచి ఎంటర్టైనర్. నితిన్, రాజేంద్రప్రసాద్ కాంబో.. సినిమాకు పెద్ద ప్లస్. డైరెక్టర్ వెంకీ కుడుముల సింపుల్ స్టోరీ తో తన మార్కులు చూపించాడు. కామెడీ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. డేవిడ్ వార్నర్ కామియో పూర్తిగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. నితిన్ ఖాతాలో మరోసారి హిట్ పక్కా. శ్రీ లీల పర్ఫామెన్స్ ఫెంటాస్టిక్, జీవి ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుందంటూ వివ‌రించారు.

రాబిన్‌హుడ్ ఓ క్రేజీ ఎంటర్టైనర్ ఫస్ట్ ఆఫ్ ఆకట్టుకుంది.. వినోదాన్ని పంచింది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ను మెప్పించారు. వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ కామెడీ ఆకట్టుకుంటుంది. ఫ్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు హైలెట్ అంటూ మరొక నెటిజ‌న్ రివ్యూ ఇచ్చాడు.

సినిమా బాగుంది. హీరో ఇంట్రడక్షన్ క్రేజీగా ఉంటుందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే కచ్చితంగా కొన్ని సర్ప్రైజ్లు ఎంటర్టైన్ చేస్తాయంటూ చెప్పుకొచ్చారు. కొందరు సినిమా ఫస్ట్ అఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. యూకే లో సినిమా ప్రీమియర్లు గ్రాండ్ గా మొదలయ్యాయి. చాలా చోట్ల కీపెన్సి కూడా అదరగొడుతుంది అంటూ అభిప్రాయాలను వెల్లడించారు.