కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. తంగలాన్ తర్వాత నటించిన తాజా మూవీ వీర ధీర శూర. తమిళ్లో వీర ధీర సూర పార్ట్ 2 గా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లోనూ గట్టి పోటీ మధ్యన రిలీజ్ అయింది. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయినా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా.. ఒకసారి రివ్యూ లో చూద్దాం.
స్టోరీ:
కాళి (విక్రమ్) ఓ చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని భార్య (దుషారా విజయన్), పిల్లలతో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఇక కాళి గతంలో అదే ఊళ్లో పలుకుబడి కలిగిన రవి( 30 ఈయర్స్ పృథ్వి) అనే పెద్దమనిషి నమ్మకమైన అనుసరుడిగా పనిచేస్తూ ఉండేవాడు. చాలా గొడవల్లో, వివాదాల్లో తలదూర్చిన కాళి.. ప్రజెంట్ గతాన్ని మరిచిపోయి పూర్తిగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాడు. అలాంటి సమయంలో రవి మళ్ళీ కాళీ ఇంటికి వచ్చి ఓ సాయం అడుగుతాడు. తనని, తన కొడుకు కన్నా(సూరజ్ వెంజరాముడు)ని ఎన్కౌంటర్ చేయాలనుకున్న ఏపీ అరుణగిరి (ఎస్. జే. సూర్య)ని చంపేయాలని.. దీనికి నీ సహాయం కావాలంటే కాళిని కోరతాడు. అందుకు కాళి ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఇంతకీ ఎస్పీకి, రవికి మధ్యలో ఉన్న గొడవేంటి.. అందులో కాళి ఇన్వాల్వమెంట్ ఏంటి.. తన కుటుంబం జోలికి వచ్చిన వాళ్ళను కాళి ఏం చేశాడు.. అనే అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
రివ్యూ:
సాధారణంగా మొదట ఒక కథను చూపించి.. ఈ కథ కంటే ముందు హీరో లైఫ్ లో ఏం జరిగిందో తర్వాత రాబోయే సీక్వెల్లో చెప్పడమే ఇప్పుడు కొనసాగుతున్న ట్రెండ్. ఇక వీర ధీర శూర సినిమాలోను అదే చెప్పడానికి ప్రయత్నించాడు డైరెక్టర్. ఇక ఒకరోజు రాత్రి సమయంలో మాత్రమే జరిగే కథగా ఈ సినిమా తెరకెక్కింది. కథ, కథనం, స్క్రీన్ ప్లే, యాక్షన్ చూస్తే.. గతంలో కార్తీ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీ సినిమా ఆనవాళ్లు కనిపించాయి. ఇందులో కద కంటే సంఘటనలే ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక పాత్రలు తీర్చిదిద్దిన తీరు, ఈ క్రమంలో పండే డ్రామా.. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.
యాక్షన్ సన్నివేశాలు, కథ మొత్తాన్ని నేచురల్ గా రూపొందించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక కథ ఎస్పీ అరుణగిరి, రవిల మధ్య గొడవలతో ప్రారంభమైంది. వీళ్లిద్దరు కథలోకి హీరో ఎంట్రీ ఇస్తాడు. అప్పటి నుంచే అసలు సినిమా మొదలైనట్లు అనిపిస్తుంది. రవి కోరిన సహాయం చేయడానికి కాళీ ఎందుకు ఒప్పుకున్నాడు. అలాగే దీనికోసం మందు పాత్రలు అమరుచే సన్నివేశాలు ప్రేక్షకుల్లో అధ్యంతం ఉత్కంట నెలకొల్పుతాయి. అప్పటిదాకా కేవలం రోల్స్.. ఇంట్రడక్షన్ మాత్రమే కనిపిస్తుంది. అసలు డ్రామా అప్పుడే ప్రారంభమవుతుంది. ఇక సినిమా అంతా ఒక ఎతైతే. ఫ్లాష్ బ్యాక్ వచ్చే సీన్స్ మరింత హైలెట్. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరి తాను అనుకున్నది కాళి చేసి చూపించడం ఎపిసోడ్ కి హైలెట్గా మారింది.
ఇక ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న కాళీకి.. గతాన్ని పరిచయం చేసిన కాళికి.. తెరపై కనిపించిన దిలీప్ మధ్యన సంబంధమేంటి.. కాళీ అసలు వానిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు. ఈ రవికి, వాణి ఫ్యామిలీకి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి.. ఇలాంటి ప్రశ్నలు అన్ని ఈ సినిమాల్లో వదిలేసి.. నెక్స్ట్ భాగంపై ఉత్సాహాన్ని కల్పించారు. ఇక సెకండ్ హాఫ్ లో కాళీ, ఎస్పీ అరుణగిరి.. కన్నా, కాళీ మధ్య జరిగే సీన్స్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతాయి. స్టోరీతో పాటు.. క్లైమాక్స్ సీన్స్ మెప్పించాయి. సింగిల్ షాట్ సీన్స్ మనల్ని ఓ స్టోరీ వరల్డ్ లో ఉన్న ఫీల్ కల్పిస్తాయి. ఇక తెరపై కనిపించే అన్ని పాత్రలను అవకాశవాదులుగా చూపించారు. ఈ క్రమంలోనే సినిమాపై కాస్త దృష్టి మరల్చినా.. తర్వాత అసలు కథ ఏం జరుగుతుందనేది అర్థం కాని పరిస్థితి. కథనం పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. అయితే సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్రేక్షకులకు అందించడంలో మాత్రం డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి.
నటీనటుల పర్ఫామెన్స్:
విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలోను తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసాడు. పైకి అమాయకంగా కనిపిస్తూనే.. కుటుంబం కోసం ఎంతకైనా తెగించే ఓ శక్తివంతమైన పాత్రలో ఆకట్టుకున్నాడు. సినిమాలో ఆయన లుక్, యాక్షన్ సీన్స్ అన్నిట్లోనూ సహజత్వం చూపించాడు. దుషారా విజయన్, విక్రమ్ మధ్య కెమిస్ట్రీ మెప్పిస్తుంది. దుషార విజయన్ ఓ ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయింది. ఎస్పి అరుణగిరి పాత్రలో ఎస్ జె సూర్య తను నటనతో ఆకట్టుకున్నాడు. సెకండ్ హాఫ్ లో ఆయన రోల్ మరింత ఇంట్రెస్టింగ్గా అనిపించింది. 30 ఇయర్స్ పృథ్వి కీలకపాత్రలో నటించాడు.
ప్రారంభం నుంచి చివరి వరకు ఆయన పాత్రలో తన నటన ఆకట్టుకుంది. సాధారణంగా కామెడీ యాక్టర్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న పృథ్వి ఈ సినిమాల్లో తన సీరియస్ నటనతో సరికొత్త కోణాన్ని చూపించాడు. టెక్నికల్గా సినిమా మరో లెవెల్ కు వెళ్ళింది. కెమెరామెన్ థేని ఈశ్వర్ తన పనితీరుతో ఆకట్టుకున్నాడు. సుదీర్ఘమైన షార్ట్స్‌తో స్టోరీ వరల్డ్ ను చూపించారు. జీవి ప్రకాష్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ మెప్పించాయి. ఇక డైరెక్టర్ అరుణగిరి మేకింగ్ కొత్త జనరేషన్ ఆలోచనలకు అర్థం పట్టినట్లు అనిపించింది. డీటెలింగ్‌గా తీర్చిదిద్దిన సన్నివేశాలు.. టెక్నికల్ టీం ను నడిపిన తీరును ప్రశంసించాల్సిందే. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమా.
ప్లస్ లు:
విక్రమ్ యాక్టింగ్ , యాక్షన్ సీన్స్, సినిమాటోగ్రఫీ , సెకండ్ హాఫ్ లో ఉత్కంఠత రేపే డ్రామా.
మైనస్ లు:
కథ బాగున్నా కథనం పెద్దగా మెప్పించలేదు.
ఫైనల్ గా: విక్రమ్ యాక్షన్ థ్రిల్లర్ మెప్పిస్తుంది.