యంగ్ హీరో నితిన్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తనదైన స్టైల్ లో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు నితిన్. అయితే ఇటీవల కాలంలో ఆయనకు వరుస ఫ్లాప్ లో ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో వెంకీ కుడుమల డైరెక్షన్లో రాబిన్‌హుడ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. గతంలో వీరిద్దరి కాంబోలో భీష్మ తెరకెక్కి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే సినిమాల్లో క్రికెట్ కింగ్ డేవిడ్ వార్నర్ ఓ ప్రధాన పాత్రలో కనిపించాడు. శ్రీ లీల హీరోయిన్గా మెరిసింది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్‌కు ముందు ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుందా.. లేదా.. నితిన్ హిట్ కొట్టాడా.. తుస్సుమనిపించాడా రివ్యూలో చూద్దాం.
స్టోరీ:
ఓ సాధారణ వ్యక్తిగ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు నితిన్. ఇలాంటి క్రమంలో ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్ మిషన్ రన్ చేయాల్సి వస్తుంది. ఇందులో భాగంగా ఆయన ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. రాబిన్ హుడ్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది.. అనే విషయాలు తెలియాలంటే సినిమాలో చూడాల్సిందే.
రివ్యూ:
డైరెక్టర్ వెంకీ కుడుముల గతంలో నితిన్ తో కలిసి భీష్మ బ్లాక్ బాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో మరో మంచి పాయింట్‌తో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు వెంకీ. మొత్తానికి ఈ సినిమా ఆడియన్స్‌కు.. యావరేజ్‌ను మించి ఎంటర్టైన్ చేసేలా ఉంది. ఇక ఫస్ట్ ఆఫ్ ఎంటర్టైనింగ్ గా సాగిన.. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్స్, ఎఫెక్షన్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే సినిమా చూసిన ఆడియన్స్ చాలా వరకు కథకు కనెక్ట్ అవుతారు. కమర్షియల్ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలో ప్రతి ఎలిమెంట్ రాబిన్‌హుడ్‌లో డైరెక్టర్ చూపించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో నితిన్ చెప్పే కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ ప్రతి ఒక్కరిని హత్తుకుంటాయి.
అంతేకాదు నితిన్ క్యారెక్టర్ మలిచిన తీరు ఆడియన్స్‌ను మెప్పించింది. జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్. కేతిక శర్మ ఐటమ్ సాంగ్ ధియేటర్లలో హ్యూజ్ రెస్పాన్స్ ను అందుకుంది. ఇక ఎక్కడ లాగ్ లేకుండా.. చెప్పాలనుకున్న పాయింట్ ను సాగదీత లేకుండా.. స్ట్రైట్ గా చెప్పే ప్రయత్నాలు చేశాడు వెంకీ కుడుముల. జెన్యూన్ అటెంప్ట్‌గా సినిమా నిలిప్పే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. ఇక కమర్షియల్ సినిమాలను తీర్చిదిద్దే విధానంలో.. ఇప్పటికే సక్సెస్ అందుకున్న వెంకి కుడుముల గతంలో తను తీసిన రెండు సినిమాలతో ఆ మార్క్‌ను చూపించాడు. ఈ క్రమంలోనే రాబిన్‌హుడ్ కూడా ఆడియన్స్‌కు బోర్ కొట్టకుండా నడిపించే ప్రయత్నం చేశాడు.
నటీనటుల పర్ఫామెన్స్:
నితిన్ సినిమాలో తన క్యారెక్టర్‌లో ఒదిగిపోయి నటించాడు. ఇప్పటివరకు ఆయన నటించని ఓ కామిక్ రోల్ లో కనిపించడమే కాదు.. సీరియస్ సీన్స్ లో సరికొత్త షేడ్స్ చూపించి ఆకట్టుకున్నాడు నితిన్. ప్రతి సీన్కు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీ లీల సైతం తన పాత్రలో ఆకట్టుకుంది. అయితే ఈమె పాత్రకు మరింత ఇంపార్టెన్స్ ఉంటే బాగుండేది అనిపించింది. షైన్ టామ్ చాక్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడనే చెప్పాలి. రాజేంద్రప్రసాద్ అక్కడక్కడ కామెడీ టచ్ చేస్తూ ఎమోషనల్ డైలాగ్స్ తోను కట్టి పడేసాడు. వెన్నెల కిషోర్ ఆడియన్స్ ను నవ్వించాడు.
టెక్నికల్ గా:
థమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్. సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. దానితో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కూడా కొంతవరకు వైవిధ్యమైన ప్రదర్శించడం.. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాల్లే కొన్ని ఎమోషనల్ సీన్స్, ఎలివేషన్స్ సీన్స్ హైలెట్గా నలిచాయనడంలో అతిశయోక్తి లేదు. సినిమాటోగ్రఫీ మెప్పించింది. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమా గా తెలుస్తుంది.
ప్లస్ లు:
నితిన్ యాక్టింగ్, అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్.
మైనస్ లు:
స్టోరీ రొటీన్ గా అనిపించింది.
ఫైనల్ గా: ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ ఒక కమర్షియల్ మూవీ.. రాబిన్‌హుడ్.