దేవర 2 పై గూస్‌బంప్స్ అప్డేట్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్టే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత హీరోగా నటించి పాన్‌ లెవెల్లో భారీ అంచ‌నాల‌ నడుమ రిలీజ్ అయిన దేవర ఎలాంటి సక్సెస్ అందుకొని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ప్రస్తుతం జపాన్లో రిలీజై భారీ క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే కలెక్షన్లు కూడా కొల్లగొడుతుంది. కాగా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మొదట టీం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారుతుంది.

NTR Jr, Devara team celebrates director Koratala Siva's birthday in special  way

దేవర పార్ట్ 2 పై డైరెక్టర్ కొరటాల శివ స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టాడని.. ఫస్ట్ హాఫ్‌ని కూడా పూర్తి చేసినట్లు సమాచారం. అంతేకాదు.. ఏప్రిల్ నాలుగవ‌ వారం నుంచి సినిమాకు సంబంధించిన సెకండ్ పార్ట్ పై స్క్రిప్ పనులు మొదలుపెట్టనున్నాడట. ప్రధాన సన్నివేశాలతో పాటు.. కీలక సీన్స్ అన్నిటిని ఎంతో ఆసక్తిగా ఆడియ‌న్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ప్లాన్ చేస్తున్నాడ‌ట‌ కొరటాల. పాన్ ఇండియన్ వైడ్‌గా కొత్త ఎలిమెంట్స్‌ను యాడ్ చేసి.. ఆడియన్స్ లో మరింత ఆసక్తి పెంచేందుకు కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.

जूनियर एनटीआर की 'देवरा' ने ओपनिंग डे पर कमाए 172 करोड़ -  Mithilanchalnews.in

ఈ సంవత్సరం నవంబర్ నుంచి సినిమా షూట్ ప్రారంభిస్తారని టాక్. ఇక మొదటి భాగంలో ఎన్టీఆర్ కు జంటగా జాన్వికాపూర్ హీరోయిన్గా మెరిసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సైఫ్ విల‌న్‌గా నటించిన ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం మరింత ప్లస్ అయింది. ఇంకా ఈ సినిమాల్లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్ మురళి కీలకపాత్రలో మెరుసారు. దేవర 2లో కూడా వీరి పాత్రలు ఎంతో ప్రధానంగా ఉండబోతున్నాయట. అలాగే దేవర 2 లో దేవర స్టోరీ ఎక్కువగా కనిపిస్తుందని.. కథలో డెప్త్ ఉంటుంద‌ని సమాచారం.