టాలీవుడ్ యంగ్ హీరోలు నార్నీ నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ మ్యాడ్ స్క్వేర్. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా.. 2023లో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన.. మ్యాడ్ సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ లో దక్కించుకుంది. ఈ క్రమంలోనే మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లతో దుమ్ము రేపుతుంది. మ్యాడ్ లాంటి సూపర్ హిట్ కామెడీ ఫిలిం కి సీక్వెల్ కావడం.. సినిమాపై ఆడియన్స్లో మొదటి నుంచే మంచి హైప్ నెలకొంది.

దీనికి తగ్గట్లుగానే వేసవి ఒంటిపూట బడులు ప్రారంభం కావడంతో.. మాడ్ స్క్వేర్ రికార్డ్ ఓపెనింగ్స్ దక్కించుకుంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.20.8 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. రెండో రోజు కూడా అదే జోష్లో దూసుకుపోయింది. ఈ క్రమంలోనే రూ.16.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేస్తుంది. అలా ఈ రెండు రోజుల్లో రూ.37.2 కోట్ల గ్రాస్‌ను సాధించిన మ్యాడ్.. మూడో రోజు ఆదివారం కావడంతో మరింత ఎక్కువ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఏకంగా రూ.18 కోట్ల గ్రామసులను సొంతం చేసుకుంది.
అలా మ్యాడ్ స్క్వేర్ మూడు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ.55.2 కోట్ల గ్రాస్ సొంతం చేసుకున్నట్లు మూవీ యూనిట్స్ స్వయంగా ప్రకటించారు. మ్యాడ్ గ్యాంగ్ చేసే కామెడీకి ప్రేక్షకుల సందడికి థియేటర్లు షేక్ అవుతున్నాయి అంటూ టీం ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇక నేడు రంజాన్ సెలవు కావడంతో ఈరోజు కూడా సినిమాకు మరింత కలిసి వచ్చే అవకాశం ఉందని.. మొత్తంగా రిలీజైన వన్ వీక్ కూడా కాకముందే బ్రేక్‌ఈవెన్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటు తెలుస్తుంది. యూత్ అంతా కలిసి ఎంజాయ్ చేసే కామెడీ సినిమా కావడంతో.. సినిమాపై కుర్రకారు మరింత మక్కువ చూపుతున్నారు. ఫుల్ రన్‌లో మ్యాడ్ స్క్వేర్ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది.