సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న వారిలో ఎంతోమంది.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కష్టాలు అవమానాల తర్వాత సక్సెస్ అందుకున్న వారు ఉన్నారు. అంతేకాదు.. సినిమాల్లో అవకాశాలు రాకముందు చిన్న చిన్న పనులు చేసుకుంటూ అవకాశాలను దక్కించుకొని సక్సెస్ అయిన వారు ఉన్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఈ కోవకే వస్తుంది. ఒకప్పుడు ఇండస్ట్రీ సెన్సేషనల్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఇందులో భాగంగానే పెళ్లిలో ఫుడ్ సర్వర్ గాను పనిచేసిన ఈ అమ్మడు.. తర్వాత హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుని ఇండియన్ పాపులర్ బ్యూటీగా మారిపోయింది.
అయితే తర్వాత ప్రేమ పెళ్లి ఆమె లైఫ్ ను మళ్లీ తలకిందులు చేశాయి. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ బ్యూటీ రాకీ సావంత్. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ లో ఎక్కువగా మెరిసి మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాల్లో హీరోయిన్ల కంటే పర్సనల్ లైఫ్ తోనే ఎక్కువ హాట్ టాపిక్ గా మారింది. స్పెషల్ సాంగ్స్ కు డ్యాన్స్ చేయడంతో మరింత పాపులర్ అయింది. 1978 నవంబర్ 28 ముంబైలో పుట్టిన ఈ అమ్మడు అసలు పేరు నెహ్రూ బెడ. ఇక ఈమె తండ్రి వర్లి లో కానిస్టేబుల్ గా పని చేసేవారు. చిన్నప్పటి నుంచి తను ఎన్నో కష్టాలు పడ్డానని.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను అంటూ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది.
పదేళ్ల వయస్సు నుంచే తను ఉద్యోగం చేస్తున్నానని.. ఓ కేటరింగ్ సర్వీస్ ఫుడ్ సర్వర్ గాను పనిచేశానంటూ చెప్పుకొచ్చింది. తనకు అప్పుడు రోజుకి రూ.50 డబ్బులు వచ్చేవని.. సినీ రంగంలోకి రావడం ఆమె తల్లిదండ్రులకు అసలు ఇష్టం లేదంటూ చెప్పుకొచ్చింది. కానీ తనకు మాత్రం చిన్నప్పటినుంచి సినిమాల్లో నటించాలని ఆశ ఉండేదని.. అందుకే ఇంట్లో వాళ్ళను కాదని సినిమాల్లోకి అడుగు పెట్టాను అంటూ వివరించింది. ఇక కాలేజీ చదువు పూర్తయిన వెంటనే సినిమాల్లోకి రావాలని ఎంత తపన పడ్డా తనకు ఆదిలోనే నిరాశ ఎదురయిందట. ఆమె రంగును హేళన చేస్తూ అవకాశాలు ఇవ్వలేదని.. ఈ క్రమంలోనే ఆమె తన శరీరానికి ముఖానికి స్పెషల్ ట్రీట్మెంట్ చేయించుకుందట. ఇక ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత ఆమెకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా మొదట బాలీవుడ్లో అగ్ని చక్రం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది రాకీ సావంత్.