టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర భాషలకు చెందిన అమ్మాయిల హావ కొనసాగుతుంది. తెలుగు అమ్మాయి అవకాశాల కోసం రావడం.. సక్సెస్ అందుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇక అందం, నటన, టాలెంట్ ఉన్నప్పటికీ ఎంతోమంది తెలుగు ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్ సక్సెస్ అందుకోలేకపోయారు. అయితే అతితక్కువ మంది తెలుగు అమ్మయిలు మాత్రం తమ నటించిన పాత్రలతో ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్స్‌గా కాకున్న.. క్రేజీ హీరోయిన్స్ గా ఇమేజ్ను దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో వైష్ణవి చైతన్య కూడా ఒకటి. ఈ అమ్మడు మొదట అలవైకుంఠపురంలో, వరుడు కావలెను సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది.
ఈ క్రమంలోనే బేబీ సినిమాలో హీరోయిన్ల ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి.. ఈ సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ ను దక్కించుకుంది. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం స్టార్ బై సిద్దు జొన్నలగడ్డతో.. జాక్ సినిమాలో హీరోయిన్గా వైష్ణవి నటిస్తోంది. ఈ సినిమాపై కూడా ఆడియన్స్ లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో వైష్ణవి డ్యూయల్ రోల్ లో మెరువనుంది. ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక దీంతోపాటే 90 మిడిల్ క్లాస్ బయోపిక్ ఓటీటీ వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా మరో సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్గా మెరవనుంది.
సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించునున్నారు. ఇలా రెండు పెద్ద బ్యానర్లలో హీరోయిన్గా చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా రెమ్యూనరేషన్ను పెంచేసిందంటూ టాక్ జోరుగా సాగుతుంది. అప్ కమింగ్ సినిమాల కోసం వైష్ణవి దాదాపు కోటి రూపాయల రెమ్యునరేషన్ను డిమాండ్ చేసిందట. అంతేకాదు.. తాజాగా ప్రొడ్యూసర్, దర్శకుడు వైష్ణవి చైతన్యకు ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది వాస్తవం అయితే.. నిజంగానే కోటి రూపాయలు అందుకున్న మొట్టమొదటి తెలుగు అమ్మాయిగా వైష్ణవి రికార్డ్ క్రియేట్ చేస్తుంది. అయితే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ను పెంచడంతో ఇప్పుడు నటిస్తున్న అన్ని సినిమాలు సక్సెస్ అందుకుంటే సరే సరి.. ఒక్క ఫ్లాప్ ఎవరైనా ఆమె కెరీర్ అంధకారంలోకి వెళ్ళిపోతుందంటూ.. ఫ్యూచర్లో ఆమెకు అవకాశాలు కష్టమే అంటూ.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.