టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ముద్దుగుమ్మ ఛార్మీ కౌర్.. సినీ ప్రొడ్యూసర్లుగా కలిసి ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్లుగా వీరిద్దరి జర్నీ కొనసాగుతుంది. 2017 లో ఛార్మితో, పూరి.. జ్యోతిలక్ష్మి సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన ఛార్మి.. పూరీ కనెక్స్ట్ బాధ్యతలను కూడా తన నెత్తిన వేసుకుంది. సినిమాలో అవకాశాలు తగ్గుతున్న క్రమంలో.. తెలివిగా ఆలోచించి ప్రొడక్షన్ రంగంలోకి అడుగు పెట్టిందని అంతా భావించారు. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్, ఛార్మి మధ్య ఎఫైర్ వార్తలు కూడా ఎన్నో వైరల్ గా మారాయి. దీనిపై ఇద్దరు స్పందించలేదు. సినిమాల నిర్మాణంలో తనకు ఛార్మి ఎంతో హెల్ప్ అయింది అంటూ పూరి.. పూరి ఇచ్చిన ప్రోత్సాహంతోనే నిన్ను నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి.. సజావుగా ఇప్పటికీ సినిమాలు నిర్మిస్తున్నానంటూ ఛార్మి చెప్పుకొచ్చారు.
ఇందులో భాగంగానే వీరి కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక అప్పటికే వరుస డిజాస్టర్లతో కుంగిపోయిన పూరికి.. ఇది మంచి థ్రో బ్యాక్. ఛార్మి కూడా ఈ సినిమా రిలీజై సక్సెస్ సాధించడంతో ఎమోషనల్ అయ్యారు. మాకు ఇంకా ముందు.. ముందు.. మంచి రోజులు రాబోతున్నాయి అంటూ కామెంట్స్ చేశారు. కానీ.. మళ్ళీ అదే స్టోరి రివర్స్ అయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత.. వచ్చిన లైగర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక తర్వాత తిరిగి రామ్ పోతినేని, పూరి, ఛార్మి కాంబోలో డబల్ ఇస్మార్ట్ మంచి అంచనాల నడుమ వచ్చి ఇది కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే పూరి.. ఛార్మికి మధ్యన గ్యాప్ పెరిగిందని.. వీరిద్దరూ విడిపోయారంటూ.. పూరి జగన్నాథ్ దూరం పెట్టేసాడని.. అతని ప్రొడక్షన్ హౌస్ లో ఛార్మి ఇకపై భాగస్వామిగా ఉండదంటూ రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే పూరీతో తనకు ఉన్న బాండ్ సక్సెస్, ఫెయిల్యూర్లతో సంబంధం లేదని.. చెప్పకనే చెప్పేసింది ఛార్మి. వాళ్ళ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని.. తాజాగా రిలీజ్ చేసిన ఒక్క కొత్త సినిమా అనౌన్స్మెంట్ తో తేలిపోయింది. విజయ్ సేతుపతితో.. పూరి జగన్నాధ్ సినిమా పై తాజాగా అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఇందులో విజయసేతుపతి, పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి దిగిన ఫోటోలు రిలీజ్ చేశారు టీం. కొత్త సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మి ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. సో వాళ్ళిద్దరి మధ్యన బంధం తెగిపోయిందని వచ్చిన వార్తలు అన్నిటికి ఈ ఒక్క ఫోటోతో చెక్ పడింది. మరి ఈసారి విజయసేతుపతి మూవీతో అయినా ఇద్దరికీ మంచి కం బ్యాక్ వస్తుందో.. లేదో.. వేచి చూడాలి.