నేషనల్ క్రష్ రష్మిక మందన కెరీర్ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. గతంలో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలతో వరుసగా ఫ్లాప్‌లు ఎదుర్కొన్న.. 2023 చివర తెరకెక్కిన రణ్‌బీర్ కపూర్.. యానిమల్‌తో మళ్ళీ ఒక్కసారిగా కెరీర్ ఫామ్‌లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఏడాది 2024 డిసెంబర్‌లో వచ్చిన పుష్ప 2.. హైయెస్ట్ వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత తాజాగా వచ్చిన ఛావా సినిమాతో నేషనల్ లెవెల్లో రష్మిక ఆడియన్స్ ప్రశంసలు దక్కించుకుంది. ఇక హ్యాట్రిక్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ తాజాగా.. సల్మాన్ ఖాన్ ‘ సికిందర్ ‘ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా నిన్న రిలీజై నెగిటివ్ టాప్ లో తెచ్చుకుంది. కేవలం సాధారణ ఆడియన్స్‌నే కాదు.. సల్మాన్ ఖాన్ అభిమానుల సైతం నిరాశపరిచింది. ఈద్ కానుకగా తెరకెక్కిన ఈ సినిమా.. సల్మాన్ గత సినిమాలో రేంజ్ ఓపెనింగ్స్ ను దక్కించుకోలేకపోయిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మొదటి నుంచి సికిందర్ సినిమాకు సరైన బజ్ లేకపోవడమే ప్రధాన కారణం అని.. దీనికి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ వచ్చాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో సల్మాన్ సినిమాకు ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక సల్మన్ సహనటులు ఎంతోమంది రూ.500 కోట్ల క్లబ్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సల్మాన్ వెనుకబడిపోయాడు. రణ్‌బీర్ యానిమల్‌తో, సన్నీ డియల్ గాధర్ 2, విక్కీ కౌశల్ ఛావాతో రూ.500 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఇక చివరకు రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న స్త్రీ 2కి కూడా రూ.500 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కానీ.. సల్మాన్ మాత్రం ఇప్పటివరకు ఆ ఫిగర్ టచ్ కూడా చేయలేకపోతున్నాడు. రష్మిక చివరి మూడు సినిమాలతో రూ.500 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. కానీ.. ఇప్పుడు సికందర్ సినిమా రూ.500 కోట్ల కలెక్షన్లను రాబట్టడం చాలా కష్టమైనట. ఆదివారంతో పోలిస్తే సోమవారం ఈద్ సెలవ కావడంతో.. కొంతమేర కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే ఫుల్ మూవీ ఆన్లైన్‌లో హెచ్డి ప్రింట్ స్ట్రీమ్ అవుతుండడంతో మేకర్స్ కు మరింత దెబ్బవుతుంది.